Balakrishna: బాలయ్య అభిమానులకు శుభవార్త. బాలయ్య – వినాయక్ కలయికలో సినిమా దాదాపు ఫిక్స్ అయింది. నిజానికి బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుండో వినాయక్ ప్లాన్ చేస్తున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ ఆన్ అవుతూ వచ్చింది. అయితే తాజాగా రచయిత గోపీ మోహన్ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చింది. కథ ఓకే అవ్వడంతో బాలయ్య వినాయక్ ను పిలిచి మరీ డేట్లు ఇచ్చాడు. దీపావళికి ఈ సినిమా లాంచింగ్ ముహూర్తం కూడా ఖరారు చేశారు.

గత ఏడాదే ఈ సినిమా ఫిక్స్ అవ్వాలి. కానీ అప్పుడు బాలయ్య వైపు నుంచి చిన్నపాటి అహం అడ్డు వచ్చి వినాయక్ కి బాలయ్య డేట్స్ ఇవ్వలేదు. తనకు సూట్ అయ్యే కథ తీసుకువచ్చాడు కాబట్టి ఇప్పుడు వెంటనే బాలయ్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తోందట. బాలయ్య ఈ సినిమాలో లెక్చరర్ గా నటిస్తున్నాడు.
బాలయ్యతో మంచి ఎమోషనల్ డ్రామాను కాలేజీ నేపథ్యంలో చేస్తే కొత్తగా ఉంటుందని వినాయక్ కూడా ఆసక్తిగా ఉన్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం చేస్తోన్న అఖండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా వల్లనే, చాలా సంవత్సరాల తరువాత బాలయ్య ఫ్యాన్స్ తల ఎత్తుకుని సగర్వంగా తమ అభిమాన హీరో సినిమా గురించి ముచ్చటించుకోగలుతున్నారు.
ఈ క్రెడిట్ బోయపాటి శ్రీనుకే దక్కుతుంది లేండి. బాలయ్య పై అదిరిపోయే టీజర్ వదిలాడు. అసలు వృద్ధ సింహంగా మిగిలిపోయిన బాలయ్య చేత మళ్ళీ గర్జించేలా చేయడం అంటే అది బోయపాటి టాలెంటే. అందుకే అఖండ శాటిలైట్ డీల్ కూడా ఎప్పుడో కుదిరింది. 19 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకొంది.
ఈ క్రమంలోనే బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూడో మూవీకి థియేటర్ రైట్స్ కూడా భారీ రేట్లు పలుకుతున్నాయి. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డికి పెద్ద రిలీఫ్ అయినట్టే. బాలయ్య పని అయిపోయింది అనుకున్న వారు అంతా… ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు.