స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన అభిమానులకు అనూహ్య బహుమతి ఇచ్చారు కలెక్షన్ కింగ్, మంచు మోహన్ బాబు. రెండేళ్ల కిందట వచ్చిన ‘గాయత్రి’ తర్వాత ఆయన పూర్తి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’లో ఎస్వీ రంగారావుగా అతిథి పాత్రో నటించారు. సూర్య హీరోగా వస్తున్న ‘ఆకాశం నీ హద్దురా’లో కూడా ఆయన గెస్ట్ రోల్ చేశారు. సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న మోహన్ బాబు.. తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లను హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ల సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఆయన కొంత విరామం తర్వాత మళ్లీ మేకప్ వేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: అలా పెంచేస్తే ఎలా సమంత?
మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాను ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా.. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్‌లో మోహన్ బాబు సీరియస్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనున్నాడు.
Also Read: కరోనా.. టాలీవుడ్ కి శుభసూచికమే !
పోస్టర్ డిజైన్, టైటిల్‌ను బట్టి చూస్తే ఇది దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. ఓ వార్తా పత్రికపై టైటిల్ ఉండడం, దానిపై 2002 అని రాసి ఉండడం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. తొందర్లోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Announcing 'SON OF INDIA'#SonofIndia#sonofindiatitleposter#HappyIndependenceDay pic.twitter.com/9K5R20EsEs
— Mohan Babu M (@themohanbabu) August 15, 2020