Pushpa 2 OTT Rights: ‘పుష్ప 2’ కోసం ఓటీటీ సంస్థలు పోటీ.. సంచలన రికార్డులు

Pushpa 2 OTT Rights: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ఈ క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ ను […]

Written By: Shiva, Updated On : August 6, 2022 3:52 pm
Follow us on

Pushpa 2 OTT Rights: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ఈ క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ ను రాజకీయ నాయకులు కూడా బాగా వాడుకున్నారు. పైగా పుష్ప సినిమా సృష్టించినంత ప్రభంజనం మరే చిత్రం సృష్టించలేదు. క్రికెటర్లతోనూ స్టెప్పులేయించిన ఈ సినిమా, తర్వాత ఓటీటీలోనూ విజయ దుందుభి మోగించింది. అందుకే ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ భారీగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

allu arjun

అందుకే పుష్ప 2 సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లేందుకు మేకర్స్ కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా మొదటి పార్ట్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. పుష్ప 2 రైట్స్ ను కూడా అమెజాన్ వారే సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట. కాగా అంతకంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తూ మిగతా ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయట. డిజిటల్ రైట్స్ విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి. మొత్తానికి పుష్ప 2 కి భారీగా డిమాండ్ ఉంది.

Also Read: Bimbisara – Sita Ramam: సీతారామం, బింబిసార‌ పేరు గొప్ప ఊరు దిబ్బ ఎందుకు? కారణం ఏమిటి?

అన్నట్టు తమిళ హీరో విజయ్‌ సేతుపతి పుష్ప 2లో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. నిజానికి పుష్పలో విలన్ గా విజయ్‌ సేతుపతినే నటించాల్సింది. విజయ్‌నే మొదట భన్వర్‌లాల్‌ షెకావత్‌ పాత్ర కోసం అనుకున్నారు. విజయ్‌ డేట్స్‌ సర్టుబాటు కాలేదు. ఆ తర్వాత మలయాళ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ ను ఈ పాత్రకు తీసుకున్నారు. ఐతే.. పుష్ప 2 స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు.

allu arjun

ఆగస్టు 22వ తేదీ నుంచి ‘పుష్ప ది రూల్’ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా షూట్ ను చాలా త్వరగా ఫినిష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, పుష్ప 1 కంటే పుష్ప 2లో యాక్షన్ ను ఫుల్ పెడుతున్నాడు సుక్కు. కాకపోతే, భారీ అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు.

అందుకే, పుష్ప టాక్ విషయంలో మొదట కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏది ఏమైనా పార్ట్ 1 అంచ‌నాల‌ను అందుకుంది. అందుకే, పార్ట్ 2 పై రెట్టింపు ఆసక్తి కలిగింది. ఇక పార్ట్-1లో ఉన్న పాత్రలే పార్ట్-2లో కూడా ఉంటాయి. అలాగే పార్ట్ 2లో మరో 3 కొత్త పాత్రలు యాడ్ అవుతాయి. అలాగే పార్ట్ 2లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపాన్ని చూస్తారని సుకుమార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మరి చూడాలి సినిమా ఎలా ఉండబోతుందో.

Also Read:Rama Rao On Duty Collections: రామారావు ఆన్ డ్యూటీ’ 8th డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ లేటెస్ట్ రిపోర్ట్స్.. ఇది రవితేజకే షాకింగ్

 

Tags