Rajinikanth-Kamal Haasan: రజినీకాంత్ కమల్ హాసన్ మధ్య పోటీ మళ్ళీ మొదలైందా..?

కమలహాసన్ రజనీకాంత్ కంటే ముందే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి రజినీకాంత్ మాత్రం కమల్ హాసన్ స్టార్ డమ్ ను దాటుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు.

Written By: Gopi, Updated On : April 27, 2024 3:52 pm

Competition between Rajinikanth and Kamal Haasan

Follow us on

Rajinikanth-Kamal Haasan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజినీకాంత్..ఈయన తన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే…ఇక దాంతో పాటుగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక కమలహాసన్ రజనీకాంత్ కంటే ముందే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి రజినీకాంత్ మాత్రం కమల్ హాసన్ స్టార్ డమ్ ను దాటుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా వీళ్ళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇండియన్ 2 సినిమాకి సంబంధించిన అఫీషియల్ డేట్ అనేది ఇంకా రానప్పటికీ లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డేట్ కూడా ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. అయితే ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి సీనియర్ హీరోలైన రజినీకాంత్ కమల్ హాసన్ లు ఇంతకు ముందు కూడా వాళ్ళ సినిమాలతో చాలాసార్లు పోటీపడ్డారు.

మరి ఈసారి కూడా ఈ సినిమాలతో పోటీ పడే అవకాశాలైతే ఉన్నాయి అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారమైతే వస్తుంది. మరి దీనికి తగ్గట్టుగానే వాళ్ళు ఒకేసారి వాళ్ల సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమా ఎక్కువ విజయాన్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వీళ్ల సినిమాలు ఇండివిజువల్ గా రిలీజ్ అయిన ఎవరి సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ సీనియర్ హీరోలు ఈ ఏజ్ లో కూడా తమకంటూ ప్రత్యేకత ను సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు.

మరి వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరిని ఎవరు డామినేట్ చేసుకుంటారు అనే విషయాలైతే తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే కమలహాసన్ విక్రమ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొడితే రజనీకాంత్ జైలర్ తో కూడా దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాడు మరి ఈ బాక్స్ ఆఫీస్ పోరులో ఈసారి విజయం సాధించేది ఎవరు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…