Commercial directors vs content based directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపు ఉంది… స్టార్ హీరోలందరు వాళ్ళతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి కమర్షియల్ సినిమాలను రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో చేస్తే సక్సెస్ లు సాధించవు. సీన్లు ఎలా ఉన్నా కూడా ట్రీట్మెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటప్పుడే సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలుగుతుంది. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు… భారీ సక్సెస్ లన్ని కమర్షియల్ సినిమాల ద్వారానే దక్కుతున్నాయని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు సైతం ఇండస్ట్రీలో మంచి ఆదరణ దక్కుతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటు కమర్షియల్ డైరెక్టర, అటు కాన్సెప్ట్ బేస్డ్ డైరెక్టర్లందరు స్టార్ హీరోలను డైరెక్షన్ చేయాలని ఆలోచనలోనే ముందుకు సాగుతున్నారు. దీనివల్ల కంటెంట్ బేస్డ్ డైరెక్టర్లు సైతం స్టార్ హీరోల కోసం కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అయి సినిమాలను చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా సినిమా కంటెంట్ చెడిపోవడమే కాకుండా ఆ సినిమాలు సైతం డిజాస్టర్లుగా మారుతున్నాయి.
కాబట్టి స్టార్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఆ కాన్సెప్ట్ కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే హీరోలుగా పెట్టుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది. దాని ద్వారా హీరోల ఇమేజ్ ల కోసం పాటలను, ఫైట్లను ఇరికించాల్సిన అవసరమైతే లేదని సినిమా మేధావులు చెబుతున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం ఇప్పుడు కమర్షియల్ సినిమాలను చేస్తున్నాం.
డిఫరెంట్ గా కొన్ని సినిమాలు చేయాలనే ఆలోచన చేసినప్పటికి వాళ్ల స్టాండర్డ్ ఎక్కడ పడిపోతుందో అనే ఉద్దేశ్యంతో కొన్ని మార్పులు చేర్పులు చేయించి ఆ కాన్సెప్ట్ లో ఉన్న సోల్ ని చంపేస్తున్నారు… అందుకే కమర్షియల్ సినిమాలను చేసే స్టార్ హీరోలు అవి చేసుకుంటేనే బెటర్ అలాగే కమర్షియల్ సినిమాలకు డైరెక్షన్ చేసే దర్శకులు ఆ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితేనే మంచిది.
కమర్షియల్ దర్శకులు వాళ్లకు తగ్గ హీరోలను సెలెక్ట్ చేసుకుంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ బేస్డ్ డైరెక్టర తమ కథలకు సెట్ అయ్యే హీరోలతో వెళితే బెటర్…ఇక్కడ కమర్షియల్ డైరెక్టర్లు గొప్పా? కంటెంట్ బేస్డ్ డైరెక్టర్లు ఎవరు గొప్ప అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది… అందుకే వీళ్ళిద్దరు కలిసి సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…