Kingdom Teaser: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(kingom teaser) టీజర్ కాసేపటి క్రితమే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, తన క్రేజ్ కి తగ్గ సినిమాలు చేయడం లేదని ఆయన అభిమానులు బాధపడుతూ ఉండేవారు. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఇది కదా విజయ్ దేవరకొండ నుండి మేము ఆశించింది అంటూ ఆనందంతో పోస్టులు వేస్తున్నారు. అయితే ఈ టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్(Junior ntr) వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. తమిళం లో హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇవ్వగా, హిందీ లో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించాడు. కానీ తెలుగు లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ పై ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ సూట్ అవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా చెప్పొచ్చు కదా, అంత బేస్ వాయిస్ అవసరమా అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వాయిస్ లో ఎలాంటి లోపం లేదు, ఆయన బేస్ వాయిస్ కి తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్ విజయ్ దేవరకొండకి లేకపోవడం వల్లే ఎన్టీఆర్ వాయిస్ ఈ టీజర్ కి సూట్ కాలేదని కొంతమందికి అనిపిస్తుంది అంటూ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి చూస్తే అదే అనిపించింది. విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చే ముందు వరకు కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కి, టీజర్ లో కనిపిస్తున్న విజువల్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడో, అక్కడి నుండి ఎన్టీఆర్ వాయిస్ బేస్ ని విజయ్ దేవరకొండ మ్యాచ్ చేయలేకపోయాడని మాకు అనిపించింది. మీకు ఏమని అనిపించిందో క్రింద కామెంట్స్ రూపం లో తెలియచేయండి. ఈ చిత్రానికి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. టీజర్ ని చూసినప్పుడే మేకింగ్ విషయంలో నాగవంశీ ఎక్కడ వెనుకాడలేదని స్పష్టంగా తెలుస్తుంది. ప్రతీ ఫ్రేమ్ కూడా ఎంతో రిచ్ గా ఉంది. ఆయన కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అనొచ్చు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. జెర్సీ లాంటి హృదయాలకు హత్తుకునే ఎమోషనల్ డ్రామా ని తీసిన గౌతమ్ లో, ఇంతటి యాక్షన్ మూవీ తీసే టాలెంట్ ఉందా అని ఈ టీజర్ ని చూసిన ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ లో ఉన్న మైనస్ ఏమిటంటే ఆయన స్లాంగ్, డిక్షన్. ప్రతీ సినిమాలో మనకి విజయ్ దేవరకొండ ని చూసినట్టే అనిపిస్తుంది కానీ, ఆయన పోషించే పాత్ర మాత్రం కనిపించలేదు. ఇందులో కూడా అలాగే ఉంటుందా అని ప్రేక్షకులు అంటున్నారు. మే30 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.