Laila: విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ చిత్రం ‘లైలా(Laila Movie)’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ అయితే పెద్ద సెన్సేషన్ అయ్యిందనే అనుకోవాలి. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ, అడుగడుగునా అడల్ట్ రేటెడ్ కంటెంట్ అనే ఫీలింగ్ వచ్చింది. కాసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి, సెన్సార్ బోర్డు వారు A సర్టిఫికేట్ ని జారీ చేసారు. అంటే 18 సంవత్సరాలకు పైబడిన వారే ఈ సినిమాని చూసేందుకు అర్హులు. దీనిని బట్టి ఈ సినిమా కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చేమో కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూస్తే పచ్చి బూతులు తిట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
విశ్వక్ సేన్ గత రెండు చిత్రాలు థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ ప్రభావం ఈ చిత్రం మీద పడుతుంది, కచ్చితంగా తక్కువ బిజినెస్ జరుగుతుందని ఆశించారు. కానీ కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగిందట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు చిత్రం విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకోవాలంటే కచ్చితంగా 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సిందే. దానికి కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం నిర్మాతలకు విడుదలకు ముందే భారీ లాభాలు తెచ్చిపెట్టాయంట.
థియేట్రికల్ రైట్స్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ ఇలా అన్నిటికి కలిపి 40 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందట. ఇది విశ్వక్ సేన్ కెరీర్ లో హైయెస్ట్ అని చెప్పొచ్చు. టాక్ తో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ సినిమాలకు ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. హిందీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలు బాగా చూస్తున్నారు. అందుకే ఆ రేంజ్ బిజినెస్ జరిగింది అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫామ్ లో లేని విశ్వక్ సేన్ సినిమాకి 7 కోట్ల రూపాయిల బిజినెస్ జరగడం అనేది సాధారణమైన విషయం కాదు. టాక్ వస్తే పండగే, కానీ టాక్ రాకపోతే మాత్రం విశ్వక్ సేన్ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ అనొచ్చు. చూడాలి మరి ఈ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందా , లేదా విశ్వక్ సేన్ కం బ్యాక్ అయ్యే సినిమా అవుతుందో అనేది.