Saripoda Shanivaram: దసరా, హాయ్ నాన్న వంటి వరుస హిట్ సినిమాల తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎస్.జె. సూర్య విలన్‌గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత, ప్రియాంక అరుళ్ మోహన్ మరోసారి నానితో జతకట్టింది. సుందరానికి తొందరెక్కువ తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో ఇది రెండవ చిత్రం. టైటిల్, పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌తో సరిపోదా శనివారం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. దీని ప్రకారం ఆగస్టు 29న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని, ఎస్.జె. సూర్య మధ్య సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. సినిమాను తదుపరి స్థాయికి తీసుకెళ్లినందుకు నేపథ్య సంగీతం ఓ కారణంగా చెప్పవచ్చు. అలాగే ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం నాని చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క హిట్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం నాని నటించిన సరిపోదా శనివారం సినిమాను హిందీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తిక్ ఆర్యన్ ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు టాక్. ఈ సినిమాకు సాటర్ డే స్టార్ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
హిందీ చిత్ర పరిశ్రమలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో టాప్‌లో ఉంటాడు కార్తీక్ ఆర్యన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా హార్రర్ కామెడీ ప్రాంఛైజీ భూల్ భూలైయా-3. అనీశ్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్1న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ చిత్రం అరుదైన ఫీట్ నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. భారీ సవాళ్లను సులభంగా అధిగమించి బ్లాక్‌బస్టర్స్ అందించే బిగ్ స్టార్‌గా కార్తీక్‌ఆర్యన్ స్థానాన్ని మరోసారి నిలబెట్టింది. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, తృప్తి డిమ్రి అండ్ టీంతో ఫన్, సస్పెన్స్, రొమాంటిక్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.