https://oktelugu.com/

Comedian Sudhakar : కమెడియన్ సుధాకర్ పరిస్థితి చూసి కన్నీళ్లు పెడుతున్న అభిమానులు..ఇలా అయ్యిపోయాడేంటి!

ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి సుధాకర్ ముఖ్య అతిథి గా విచ్చేసారు. ఈయనని చూసిన వెంటనే ఆడియన్స్ అసలు గుర్తుపట్టలేక పోయారు. అసలు ఈయన నిజంగానే సుధాకర్ యేనా, ఇలా అయిపోయాడేంటి, మన చిన్నతం లో కడుపుబ్బా నవ్వించిన కమెడియన్స్ లో ఒకరైన సుధాకర్

Written By: , Updated On : June 17, 2023 / 09:41 PM IST
Follow us on

Comedian Sudhakar : నిన్నటి తరం కమెడియన్స్ లో డిఫరెంట్ కామెడీ టైమింగ్ మరియు మ్యానిరిజమ్స్ తో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించే కమెడియన్స్ లో ఒకరు సుధాకర్.హీరోగా తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్థిరపడిపోయి ఇక్కడ కమెడియన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాడు.

సుమారుగా 700 కు పైగా చిత్రాల్లో కమెడియన్ గా నటించిన సుధాకర్, చాలా కాలం నుండి సినిమాల్లో యాక్టీవ్ గా లేదు. మధ్యలో ఒక సినిమాలో చిన్న పాత్ర ద్వారా కనిపించినా అది ఏమాత్రం గుర్తించుకోదగ్గ పాత్ర కాదనే చెప్పాలి. ఈమధ్యనే ఆయన చనిపోయాడంటూ వార్తలు కూడా వినిపించాయి. ఈ పుకార్లు సుధాకర్ వరకు చేరడం తో ఆయన వెంటనే స్పందించి అభిమానులకు ఒక వీడియో బైట్ ద్వారా నేను చాలా బాగున్నాను, ఎంతో సంతోషం గా ఉన్నాను, దయచేసి సోషల్ మీడియా లో వచ్చే ప్రచారాలను నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉండగా ప్రతీ ఆదివారం జీ తెలుగు ఛానల్ లో ప్లాన్ చేసే స్పెషల్ ప్రోగ్రాం లాగానే ఈ వారం కూడా ఒక ప్రోగ్రాం ని ఏర్పాటు చేసారు. ‘ఫాథర్స్ డే’ సందర్భంగా ‘నేను నాన్న’ అనే పేరు తో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి సుధాకర్ ముఖ్య అతిథి గా విచ్చేసారు. ఈయనని చూసిన వెంటనే ఆడియన్స్ అసలు గుర్తుపట్టలేక పోయారు. అసలు ఈయన నిజంగానే సుధాకర్ యేనా, ఇలా అయిపోయాడేంటి, మన చిన్నతం లో కడుపుబ్బా నవ్వించిన కమెడియన్స్ లో ఒకరైన సుధాకర్ ని ఇలాంటి పరిస్థితి లో చూడలేకపోతున్నాము అంటూ కన్నీటి పర్యంతమై సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సుధాకర్ కి గతం లో ఒక అరుదైన వ్యాధి వచ్చిందని, దాంతో ఆయన బాగా సన్నబడిపోయాడని, అప్పటి నుండి ఆయన ఇలా మారిపోయాడని సుధాకర్ కుమారుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఇక సుధాకర్ పాల్గొన్న ‘నేను నాన్న’ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ని క్రింద అందిస్తున్నాము చూడండి.

Comedian Sudhakar Garu Tribute Promo | Nenu Nanna | Father's Day Special | This Sunday @ 6:00 PM