Comedian Sudhakar: తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుధాకర్ 600 సినిమాలకు పైగానే నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించు కున్నాడు. స్నేహితుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 90 దశకాల్లో ఆయన దాదాపు ప్రతి సినిమాలో కనిపించి ప్రేక్షకులను తన టైమింగ్ తో ఆకట్టుకోవడమే కాకుండా కడుపుబ్బా నవ్వించాడు.

అంత గుర్తింపు పొందిన ఆయన సడెన్ గా సినిమాలకు దూరం అయ్యాడు. గత 20 ఏళ్లుగా ఆయన తెరమీద కనిపించలేదు. కొన్ని అనారోగ్య కారణాలతో సుధాకర్ సినిమాలకు దూరం అయ్యాడు. ఇన్ని ఏళ్లుగా దూరంగా ఉంటున్న ఆయన మళ్ళీ ఇప్పుడు తెరమీద కనిపించ డానికి సిద్ధం అవుతున్నాడు. కానీ ఆయనకు అవకాశాలు మాత్రం రావడం లేదట.
చిరంజీవి, రజనీకాంత్ లా ఉండాల్సిన ఆయన సాధారణ కమెడియన్ గా మిగిలి పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయట. సుధాకర్ 1977లో చిరంజీవి తో పాటు ఒకేసారి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. అక్కడి నుండి ఒకేసారి చిరు, సుధాకర్ ఒకేసారి పట్టా తీసుకుని బయటకు వచ్చారట. యాక్టింగ్ స్కూల్ లో ఉన్న సమయంలోనే సుధాకర్ కు తమిళ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్ళిపోయాడట.
సుధాకర్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించాడు. ఈయన కేవలం 3 సంవత్సరాలలో 40 సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఈయన దూకుడును చుసిన స్టార్ హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి వాళ్ళు కూడా భయపడ్డారట. తెలుగు వాడు తమిళ్ లోకి వచ్చి ఇంత గుర్తింపు తెచ్చుకోవడం అక్కడి దర్శక కొంతమంది హీరోలకు కూడా నచ్చక ఆయనను తొక్కేసారట.
Also Read: Pushpa: ‘పుష్ప’కు అన్ని కోట్లు పెట్టినా క్వాలిటీ ఎక్కడా కనిపించిందే లే?
సూపర్ స్టార్ గా ఎదుగుతున్న ఆయనకు అవకాశాలు రాకుండా చేసారు. తెలుగు వాడు అనే కారణంతో ఆయన తమిళ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. ఈయన నటించిన 40 సినిమాల్లో 30 సినిమాలు ఘానా విజయం సాధించాయట. ఈయన రాధికా తో కూడా నటించారట. వీరిద్దరి జోడీ తమిళ్ లో చాలా పాపులర్ అంట. అంత ఇమేజ్ తెచ్చుకున్న సుధాకర్ కొంత మంది కారణంగా కెరీర్ లో సూపర్ స్టార్ గా ఎదగాల్సిన ఆయన కమెడియన్ గా మిగిలి పోయాను అంటూ సుధాకర్ స్వయంగా చెప్పుకున్నారు.
కమెడియన్ గా కూడా 600 సినిమాలు చేసి ఇక్కడ కూడా గుర్తింపు తెచుకున్నాడు. ఏది ఏమైనప్పటికి సూపర్ స్టార్ అవ్వాల్సిన సుధాకర్ కమెడియన్ గా మిగిలి పోయాడు. కొంతమంది తమ కెరీర్ కోసం సుధాకర్ కు అవకాశాలు రాకుండా చేసి ఆయనను ఎదగకుండా అడ్డుకున్నారు.
Also Read: Rashi Khanna: 8ఏళ్ల తర్వాత బాలీవుడ్లోకి రీ ఏంట్రీ.. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాశీఖన్నా