https://oktelugu.com/

Rahul Ramakrishna- Anasuya: ఈ లొల్లేంది తల్లీ? అనసూయకు కమెడియన్ రాహుల్ రామకృష్ణ కౌంటర్!

అనసూయ ట్వీట్ కి ఆయన రిప్లై ఇచ్చారు. ''కలుగజేసుకుంటున్నందుకు క్షమించాలి. కానీ నాకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అసలు ఇదంతా ఏంటీ? ఎందుకు?'' అని కామెంట్ పెట్టారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 11, 2023 / 08:30 AM IST

    Rahul Ramakrishna- Anasuya

    Follow us on

    Rahul Ramakrishna- Anasuya: అనసూయ వివాదం అంతకంతకూ పెద్దదవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కౌంటర్లు ఇవ్వడం ఆపడం లేదు. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో మీడియాతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీద అసహనం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే, ఉప్పూకారం తింటుంటే నిజాలు రాయండి అని మీడియాకు సవాల్ విసిరారు. అలాగే ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ చేతకాని వాళ్ళు అదుపు తప్పారని సెటైర్ వేశారు. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు. నన్ను తిడుతున్న మీ నోళ్లే కంపుకొడుతున్నాయని ఆమె కామెంట్స్ చేశారు.

    అంతటితో ఆగకుండా ఓ ట్వీట్ చేసింది. ‘నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పు కానీ నేనెలా తప్పు అవుతాను. నా పెంపకం గర్వించదిగింది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. వేధించేవాడు సిగ్గుపడాలి, వేధించబడుతున్నవాళ్ళు కాదు..’ అని కామెంట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ స్పందించడం విశేషం.

    అనసూయ ట్వీట్ కి ఆయన రిప్లై ఇచ్చారు. ”కలుగజేసుకుంటున్నందుకు క్షమించాలి. కానీ నాకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అసలు ఇదంతా ఏంటీ? ఎందుకు?” అని కామెంట్ పెట్టారు. రాహుల్ రామకృష్ణ కామెంట్ కి అనసూయ ఇంకా స్పందించలేదు. మీరు చేసే ఈ లొల్లికి కారణం ఏంటని రాహుల్ రామకృష్ణ ఆమెను నేరుగా ప్రశ్నించాడు. సాధారణంగా అనసూయ వెంటనే స్పందిస్తుంది. ఎందుకో ఆమె ఇంకా రిప్లై ఇవ్వలేదు.

    కొద్దిరోజులుగా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఖుషి పోస్టర్ మీద అనసూయ అభ్యంతరం తెలిపారు. సదరు పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు The అని వేశారు. The నా? అమ్మో పైత్యం బాగా పెరిగిపోయిందంటూ అనసూయ విజయ్ దేవరకొండను ఎద్దేవా చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గతంలో కూడా లైగర్ మూవీ పరాజయాన్ని ఉద్దేశిస్తూ అనసూయ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది.