Prithviraj: కమెడియన్ పృథ్వి రాజ్ కి ప్రతి నెల రూ. 8 లక్షల జరిమానా విధించిన కోర్టు? ఎందుకంటే?

సినిమా ఇండస్ట్రీలో ఊహించని రేంజ్ లో పేరు సంపాదించిన పృథ్వి రాజ్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి మంచి ప్రాచుర్యం పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈయనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇచ్చింది.

Written By: Suresh, Updated On : October 31, 2023 2:07 pm

Prithviraj

Follow us on

Prithviraj: టాలీవుడ్ లో కమెడియన్స్ లిస్ట్ తీస్తే చాలా పెద్దగానే ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా సినిమాలే ఉండేవి కావు. కానీ ఇప్పుడు నవ్వించే వారి సంఖ్య కోకొల్లాలుగా ఉంది. ఇక మన టాలీవుడ్ కమెడియన్స్ లో పృథ్వి రాజు ముందు వరుసలో ఉంటారు. ఈయన ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ మంచి పాపులారిటీ సంపాదించి పెట్టిన సినిమా మాత్రం ఖడ్గమే అని చెప్పాలి. ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పిన డైలాగ్ ఫుల్ ఫేమస్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా ప్రతి ఒక్కరు అదే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అదే పేరుతో ఫేమస్ అయ్యారు కూడా పృథ్వి. కమెడియన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సంపాదించారు ఈ నటుడు, కమెడియన్. ఇంతకీ ఈయన గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆ వివరాలు మీకోసం..

సినిమా ఇండస్ట్రీలో ఊహించని రేంజ్ లో పేరు సంపాదించిన పృథ్వి రాజ్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి మంచి ప్రాచుర్యం పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈయనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇచ్చింది. ఈ పదవిని కాస్త పక్క దారిపట్టించారు ఈ నటుడు. ఈయన రాసలీల వీడియో బయటకు రావడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయననే స్వచ్ఛంధంగా పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూనే సినిమాల్లో కూడా బిజీ అయ్యారు.

పృథ్వి రాజ్ తన భార్య కవితకు విడాకులు ఇస్తున్నట్టు కోర్టులో పిటీషన్ పెట్టి చాలా కాలం అయింది. అందుకు ఆయన సతీమణి కవిత కూడా ఒప్పుకుంది. అయితే అలీమొనీ కింద తన భార్యకు నెలకు 8లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడమే కాదు చర్యకు దారి తీసింది. ఇక నెలకు రూ. 8లక్షలు ఇవ్వడం ఏంటి? ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి తీర్పు అంటూ పృథ్వి నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదని.. తన నెల సంపాదనను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి తీర్పు ఇస్తే బాగుంటందని.. దీన్ని ఒకసారి జడ్జి పరిశీలిస్తే ఆయనకు ఒక అవగాహన వస్తుందంటూ ఆరోపించారు. మరి ఈయన మాటలు విన్న కోర్టు ఈ తీర్పులో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తారో లేదో చూడాలి.