Sreemukhi : జబర్దస్త్ కమెడియన్స్ లో ధన్ రాజ్ ఒకరు. కమెడియన్ కావాలని ధన్ రాజ్ పరిశ్రమకు వచ్చాడు. జగడం, భీమిలి కబడ్డీ చిత్రాల్లో నటనకు ప్రశంసలు దక్కాయి. కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో నటిస్తూనే జబర్దస్త్ కి వచ్చాడు. ధనా ధన్ ధన్ రాజ్ పేరుతో టీమ్ ఏర్పాటు చేసి లీడర్ గా వ్యవహరించాడు. చాలా కాలం జబర్దస్త్ లో ధన్ రాజ్ కొనసాగాడు. ధన్ రాజ్ నిర్మాతగా మారి సర్వం కోల్పోయాడు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. శ్రీముఖి హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం ధన్ రాజ్ ని రోడ్డు మీదకు తెచ్చిందట.
సాయి అచ్యుత్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ సచ్చినోడి ప్రేమ కథ అనే సినిమా చేయాలని ధన్ రాజ్ అనుకున్నారు. కానీ నిర్మాతలు ఎవరూ దొరక్కపోవడంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఈసారి సాయి అచ్యుత్ తో తానే నిర్మాతగా సినిమా చేయాలని ధన్ రాజ్ డిసైడ్ అయ్యాడు. ధనలక్ష్మి తలుపు తడితే టైటిల్ తో ఈ మూవీని ధన్ రాజ్ నిర్మించాడు. ధన్ రాజ్ తో పాటు మరొక ఎన్నారై నిర్మాణ భాగస్వామిగా జాయిన్ అయ్యాడు.
ధన్ రాజ్, శ్రీముఖి, తాగుబోతు రమేష్, మనోజ్ నందం, రణధీర్ గట్ల ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రంలో నాగబాబు, తనీష్, రష్మీ, వేణు, చంటి గెస్ట్ రోల్స్ చేయడం విశేషం. 2015లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రాన్ని బాహుబలి దెబ్బ తీసింది. కేవలం వారం రోజుల వ్యవధిలో బాహుబలి మూవీ విడుదలైందట. దాంతో ధనలక్ష్మి తలుపు తడితే చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదట.
ఈ చిత్రం నిర్మించేందుకు, విడుదల చేసేందుకు ధన్ రాజ్ అప్పటి వరకు సంపాదించిన మొత్తం పెట్టేశాడట. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు కూడా చేశాడట. బాహుబలి విడుదలతో ధనలక్ష్మి తలుపు తడితే మూవీ తీవ్ర నష్టాలు మిగిల్చింది. ఆ విధంగా శ్రీముఖిని హీరోయిన్ ని చేస్తూ ధన్ రాజ్ నిర్మించిన ధనలక్ష్మి తలుపు తడితే మూవీ ఆయన్ని నిండా ముంచేసింది. ఆ చిత్రం నష్టాల నుండి బయటపడేందుకు ధన్ రాజ్ ఏళ్ళ పాటు కష్టపడాల్సి వచ్చిందట.