spot_img
Homeఎంటర్టైన్మెంట్Salim Baig : ఘర్షణ’ పండా.. ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

Salim Baig : ఘర్షణ’ పండా.. ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

Salim Baig : ఒక సినిమా సక్సెస్ కావాలంటే అన్నీ కోణాలను మెప్పించాలి. కొందరు సెంటిమెంట్ కోరుకుంటారు.. మరికొందరు కామెడీ కోరుకుంటారు.. ఇంకొందరు మాత్రం యాక్షన్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆనాటి నుంచి నేటి వరకు కొన్ని యాక్షన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కొందరు హీరోలో ఓ వైపు ఫ్యామిలీ చిత్రాల్లో అలరిస్తూనే..మరోవైపు యాక్షన్ సినిమాలతో తమదైన నటనతో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన విక్టరీ వెంకటేష్ పేరు చెప్పగానే సెంటిమెంట్ హీరో అని అంటారు. ఫ్యామిలీ చిత్రాలను తీయడంలో ఆయనకు మించి ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఆయన తీసిన కొన్ని సినిమాలు మనసును కదిలించడమే కాకుండా కన్నీళ్లు తెప్పించాయి. సినిమాలు ఎక్కువగా కోరుకునే ఆడవాళ్లు వెంకటేష్ సినిమాలేంటే ఎక్కువగా ఇష్డపడుతారు. కానీ ఇదే సమయంలో వెంకీ మాస్ ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తీసిన ‘గణేష్’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి వెంకీ ఫ్యాన్స్ మాస్ సినిమాలు కావాలని కోరుకుంటూ వస్తున్నారు. ఆయితే 2004లో వరకు వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాల హీరో అని అనిపించుకుంటున్నాడు. కానీ ఈ ఏడాదిలో ఆయన ఓ యాక్షన్ మూవీలో నటించాల్సి వచ్చింది. అదే ఘర్షణ. వెంకటేష్, ఆసిన్ తదితరులు నటించిన ఈ మూవీ గురించి ఎవరూ మరిచిపోరు. ముఖ్యంగా ఇందులో విలన్ పండా గురించి కలలో కూడా మరిచిపోరు. అయితే ఈ పండా అనే పాత్రలో నటించిన వ్యక్తి ఎవరు? ఇప్పుడేం చేస్తున్నారు? ఆ వివరాల్లోకి వెళితే..

గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఘర్షణ అనే సినిమాలో పండా పాత్రలో నటించిన వ్యక్తి పేరు సలీమ్ బేగ్. ఇతను మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత జై సినిమాలో మొదటిసారిగా కనిపించారు. అయితే ‘ఘర్షణ’ సినిమాతో ఫేమస్ అయిన సలీమ్ బేగ్ కు ఆ తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆంధ్రుడు, జగపతి, కాస్కో, ఒక్క మగాడు, అందివాడు వంటి సినిమాల్లో నటించారు. సలీమ్ బేగ్ ఎందులో నటించినా ఆ సినిమాకు హైలెట్ గా ఉంటారు. ఒక విలన్ పాత్రలో ఎలా నటించాలో సలీమ్ బేగ్ నటన చూస్తే తెలుస్తుంది.

ఇక ఘర్షణ సినిమాలో అయనను చూస్తే ఒకరకంగా భయపుడుతుంది. ఈ సినిమాలో హీరోతో సమానంగా పండా పాత్రకు పేరువచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళం సినిమాల్లో నటించి సలీమ్ బేగ్ మరోసారి గౌతమ్ మీనన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అదే ‘ధ్రువ నక్షత్రం’. అయితే ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. లీగల్ సమస్యలు ఎదుర్కొవడంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి.

ఇక సలీమ్ బేగ్ అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనస్టైల్ పూర్తిగా మారిపోయింది. సినిమాలో భయపెట్టిన ఆయన రియల్ గా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పిక్స్ పై కొందరు కామెంట్లు కురిపిస్తున్నారు. మళ్లీ సినిమాల్లో నటించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ సలీమ్ బేగ్ మాత్రం ఆసక్తి చూపినట్లు కనిపించడం లేదు. అయితే ఈయన మరోసారి సినిమాల్లోకి వస్తే మాత్రం సినిమా రేంజ్ పెరుగుతుందని కొందరు కొనియాడుతున్నారు. తెలుగులో అవకాశం వస్తే నటించడానికి సలీమ్ బేగ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన అధికారికంగా మాత్రం ఏ విషయాన్ని ప్రకటించడం లేదు. ఏదీ ఏమైనా సలీమ్ బేగ్ కొన్ని సినిమాల్లో నటించి అందరినీ తన నటనతో ఆకట్టుకున్నాడు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper