CM Revanth Reddy : గద్దర్ అవార్డ్స్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసహనం… ఇండస్ట్రీ తరపున చిరంజీవి షాకింగ్ రియాక్షన్!

నంది అవార్డులను గద్దర్ అవార్డ్స్ పేరుతో టాలీవుడ్ నటులను, సాంకేతిక నిపుణులను సత్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పరిశ్రమ ప్రతినిధులు సూచనలు చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Written By: S Reddy, Updated On : July 30, 2024 9:35 pm
Follow us on

CM Revanth Reddy :గతంలో ప్రతి ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రతిభ కనబరచిన నటులు, సాంకేతిక నిపుణులను నంది అవార్డ్స్ తో ప్రభుత్వం సత్కరించింది. కొన్ని కారణాలతో నంది అవార్డుల సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఇటీవల హీరో చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ వేదికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులను ఇకపై గద్దర్ అవార్డ్స్ గా పేరు మార్చాలని అనుకుంటున్నాం. ప్రతి ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులకు గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని భావిస్తున్నామని అన్నారు.

ఈ ప్రతిపాదనపై తెలుగు సినిమా ప్రతినిధులు స్పందించాలి. ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. డిసెంబర్ నెలలో అవార్డుల ప్రధానం కార్యక్రమం జరుపుకుందామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమాజ హితం కోసం అహర్నిశలు పని చేసిన గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం సముచితం అన్నారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిందంటే అది ప్రభుత్వాల ప్రోత్సాహం వలనే అన్నారు.

ఈ కార్యక్రమం జరిగి నెలలు గడుస్తున్నా టాలీవుడ్ నుండి గద్దర్ అవార్డ్స్ ప్రకటనపై స్పందన లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డ్స్ పై సూచనలు చేయాలని తెలుగు చిత్ర పరిశ్రమను కోరి చాలా కాలం అవుతుంది. వారి నుండి ఎలాంటి సమాచారం రాలేదు. వారు సూచనలు చేస్తే సరి లేదంటే డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తుందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చారు.

”ప్రజా గాయకుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతి ఏటా గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తర్వాత, తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యతలు తీసుకోవాల్సింది గా కోరుతున్నాను… ” అని ట్విట్టర్ ఎక్స్ లో చిరంజీవి రాసుకొచ్చారు. చెప్పాలంటే చిరంజీవి పరిశ్రమ పెద్దగా ఉన్నారు. ఆయన స్పందించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ముందుకు సాగే సూచనలు ఉన్నాయి.

కాగా టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాడు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుగు పరిశ్రమ చాలా సన్నిహితంగా ఉండేది. మాజీ మంత్రి కేటీఆర్ కి పరిశ్రమలో చాలా మంది మిత్రులు ఉన్నారు. ఆయన సినిమా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేవారు. ప్రభుత్వం మారాక కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు టాలీవుడ్ లో కనబడుతున్నాయి. ఈ క్రమంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

అలాగే టికెట్స్ ధరల పెంపు కోసం ప్రభుత్వం వద్దకు వచ్చే బడా హీరోలు, ప్రొడ్యూసర్స్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా వీడియోలు చేసి వదలాలని హుకుం జారీ చేశాడు. అలాంటి వారికే టికెట్స్ ధరలు పెంచుకుని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని మొహమాటం లేకుండా చెప్పాడు. టాలీవుడ్ అంటే ఆయన గరం అవుతున్నాడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ ప్రముఖులపై ఉంది.