CM Revanth Reddy OG: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధించిన స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక సుజిత్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘ఓజీ’ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు…
ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా చేపట్టారు.మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రీమియర్స్ కి అవకాశాలనైతే ఇచ్చింది. ఇక దాంతో పాటుగా టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ఓజీ మూవీ టికెట్ల రేటు పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు.
ఇక తెలంగాణలో 24 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్స్ కి పర్మిషన్స్ అయితే వచ్చాయి. ఆ రోజు 800 రూపాయల టికెట్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది…ఇక ఇదే రేటు అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగబోతోంది. సింగిల్ స్క్రీన్స్ పైన జిఎస్టి తో కలిపి 100 రూపాయలు పెంచగా మల్టీప్లెక్స్ లో మల్టీ ఫ్లెక్స్ ల మీద 150 రూపాయలను పెంచినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అతని అభిమానులు టిక్కెట్ రేట్లు ఎంత పెంచినా కూడా తన సినిమా చూడటానికి ఆసక్తి ఎదురు చూస్తూ ఉండడం విశేషం…మరి ఈ సినిమాని చూడడానికి ప్రతి ఒక్క రు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఓజీ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుంది. తద్వారా ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…