RRR – Bheemla Nayak Clash: ప్రతి సంక్రాంతికి ఎదురయ్యే సమస్యే ఇది . వసూళ్లు వర్షం కురిపించే సంక్రాంతి సీజన్ ని వదులుకోవడానికి నిర్మాతలు ఇష్టపడరు.అందుకే పెద్ద పెద్ద హీరోలు సంక్రాంతి సీజన్ కి తమ సినిమాలు విడుదల చేయడానికి పోటీపడతారు. పండుగకి మేము వస్తాం అంటే మేము వస్తాం అంటూ పందానికి, పంతాలకు దిగుతారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి అందరూ తమ తమ సొంత ఊళ్లకు వెళతారు . పండుగ మూడు రోజుల్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి కొత్త సినిమాలు చూడడానికి థియేటర్స్ కి పోటెత్తుతారు. ఎప్పటి నుండో ఇది ఆనవాయితీగా ఉంది. సినిమా బాగుంటే పోటీతో సంబంధం లేకుండా రెండు మూడు సినిమాలు కూడా హిట్ అవుతాయి.
Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ ల “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ ట్రైలర్ కి టైమ్ ఫిక్స్… ఎప్పుడంటే ?

2020లో సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురంలో విడుదల విషయంలో పెద్ద రాద్దాంతం జరిగింది. విడుదల తేదీలు కన్ఫర్మ్ అయినప్పటికీ థియేటర్స్ సర్దుబాటు విషయంలో ఇరు నిర్మాతల మధ్య గొడవలు తలెత్తాయి. ఒక్క రోజు వ్యవధిలో రెండు సినిమాల విడుదల ఉన్న నేపథ్యంలో థియేటర్స్ మాకంటే మాకంటూ కొట్టుకున్నారు. ఓ దశలో ఇదంతా వద్దు, ఒకే రోజు విడుదల చేసి ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం.. అనే వరకు వెళ్ళింది. దిల్ రాజు నేతృత్వంలో జరిగిన చర్చలు ఫలించడంతో గొడవ సద్దుమణిగింది.
ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్ సినిమాల మధ్య ప్రస్తుతం ఇదే తరహా సమస్య నెలకొని ఉంది. ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి బరిలో నిలవగా, భీమ్లా నాయక్ చిత్ర విడుదల వాయిదా వేసుకోవాలని ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు కోరుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ రీత్యా ఎక్కువ థియేటర్స్ అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారు. ఐదు రోజుల వ్యవధిలో భీమ్లా నాయక్ విడుదల ఉంది, అది కూడా పవర్ స్టార్ పవన్ వంటి పెద్ద హీరో మూవీ కావడంతో థియేటర్స్ సర్దుబాటు సమస్య ఏర్పడుతుందని ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు భావిస్తున్నారు. భీమ్లా నాయక్ విడుదల తేదీ వెనుకకు జరపాలని ఎంత వేడుకున్నా, ఆ చిత్ర నిర్మాతలు ససేమిరా అంటున్నారు. దీంతో 2020లో మహేష్ అల్లు అర్జున్ మధ్య జరిగిన గొడవ, 2022లో ఆర్ ఆర్ ఆర్ భీమ్లా నాయక్ మధ్య నెలకొందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఆ సినిమా కోసం వారితో కలిసి ఎలుకలు పట్టడానికి కూడా వెళ్ళాను అంటున్న… నటి లిజోమోల్