Naga Chaitanya Samantha
Naga Chaitanya Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు నాగ చైతన్య – సమంత. ప్రేమించి పెళ్లి చేసుకుని అనూహ్యంగా విడాకులు తీసుకుని తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం తమ కెరీర్స్ లో బిజీగా గడుపుతున్నారు. సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. వీళ్లిద్దరు విడిపోయి దాదాపు మూడేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ సామ్ – నాగ చైతన్యల గురించి ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
తాజాగా మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. నాగ చైతన్య – సమంత ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది. విడాకులు తీసుకుంటే అన్ ఫాలో చేయాలా అంటూ చైతూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నాగ చైతన్య ని పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. భర్తతో విడాకుల నేపథ్యంలో సమంత అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నుండి చైతన్య జ్ఞాపకాలు చెరిపేసింది. అలాగే చైతన్యను అన్ ఫాలో చేసింది. అయితే ఇప్పటికీ సమంతను ఫాలో అవుతున్నాడు నాగ చైతన్య.
ఈ క్రమంలో సమంత, నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చకు దిగారు. డివోర్స్ తీసుకుంటే అన్ ఫాలో చెయ్యాలా .. మా చెయ్ బంగారం. నిజమైన ప్రేమంటే నాగ చైతన్య దే అందుకే ఇప్పటికీ సామ్ ని ఫాలో చేస్తున్నాడు. సమంత గురించి ఒక్కసారి కూడా చెడుగా మాట్లాడలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత అలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం సామ్ – చెయ్ కలవాలని కోరుకుంటున్నారు. ఎవరిని తప్పు బట్టవద్దని అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం సమంత విరామంలో ఉంది. ఇటీవల హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసింది. ఒక ఎపిసోడ్ విడుదల చేసింది. నెక్స్ట్ బాలీవుడ్ సిరీస్ సిటాడెల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగ చైతన్య ‘ తండేల్ ‘ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న చైతన్య క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
Web Title: Clash between naga chaitanya samantha fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com