Sai Pallavi : హీరోయిన్స్ అంటే జనాల్లో మంచి అభిప్రాయం సాధారణంగానే ఉండదు..కేవలం అందాల ఆరబోతకు మాత్రమే వాళ్ళు పరిమితం..అలాంటి వాళ్ళే ఇండస్ట్రీ లో నెగ్గుకురాగలరు అని అందరూ అంటూ ఉంటారు.. అది వాస్తవమే..సౌత్ లో ఇప్పటి వరకు వచ్చిన హీరోయిన్స్ అందరూ దశాబ్దాల తరబడి ఇండస్ట్రీ లో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారంటే కారణం అదే.

కానీ కేవలం అందాల ఆరబోసే హీరోయిన్స్ మాత్రమే కాదు, వాటికి పూర్తి వ్యతిరేకంగా నిలిచి,టాలెంట్ తో మాత్రమే ఇండస్ట్రీ లోకి దూసుకొని రాగలము అంటూ నిరూపించిన హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీ లో కొంతమంది ఉన్నారు..ఆ కొంతమంది లో ఒకరే సాయి పల్లవి..ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు..అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు..ఈమె హీరోయిన్ గా నటించిన ఆఖరి చిత్రం ‘విరాటపర్వం’ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది..ఆ సినిమా తర్వాత ఆమె ఏ సినిమాకి కూడా సైన్ చెయ్యలేదు.
దీనితో సాయి పల్లవి సినిమాలు ఆపేస్తుందని, వృత్తి పరంగా ఆమె ఒక డాక్టర్ కాబట్టి త్వరలోనే ఆమె ఒక హాస్పిటల్ స్థాపించబోతున్నారు అంటూ వార్తలు జోరుగా ప్రచారం సాగాయి..అభిమానులు కూడా ఈ వార్తలను నమ్మారు.. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి తనదైన శైలిలో స్పందించింది..ఆమె మాట్లాడుతూ ‘నేను చేసే ప్రతీ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చాలనే కోరుకుంటాను..పాత్రలు కూడా అలాంటివే సెలెక్ట్ చేసుకుంటాను..నా తల్లిదండ్రులు నన్ను వెండితెర మీద చూసినప్పుడు గర్వపడేలాగానే ఉండాలి కానీ , వాళ్ళు నన్ను చూసి సిగ్గుతో తలదించుకునే పాత్రలు మాత్రం నేను చెయ్యను.
విరాటపర్వం తర్వాత ఎన్నో కథలు విన్నాను.. కానీ వాటిల్లో నా నటనకి ఏ మాత్రం ప్రాధాన్యత లేదు..నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కినప్పుడే నేను సినిమా చేస్తాను..అప్పటి వరకు ఎదురు చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి..ఈ ఒకే ఒక్క క్లారిటీ తో ఇన్ని రోజులు సోషల్ మీడియా లో వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టేసింది సాయి పల్లవి.