Theaters VS AP Govt: ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్లలో సోదాలు హాట్‌టాపిక్‌గా మారాయి. అసలు ఎక్కడా రాజీపడకుండా నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా.. థియేటర్లు నడిపితే.. అసలు ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు థియేటర్లను మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరికొంత మంది ఓనర్లు నష్టాల్లో పడిపోవడం కంటే థియేటర్ మూసేయడం మంచిదని భావిస్తూ.. స్వచ్ఛందంగా థియేటర్లను మూసేస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఏపీలో థియేటర్లు పూర్తిగా మూతపడటం ఖాయమని అర్థమవుతోంది.

ఏపీలో టాలీవుడ్ వర్సెస్ సర్కార్ అన్నట్లు తయారైంది పరిస్థితి. ఓ వైపు సినిమా ధరలను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం జీఓ పాస్ చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సినీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. ఇటీవలే హీరో నాని చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగానూ పెను దుమారం రేపాయి. థియేటర్లలో యాజమాన్యాలు రేట్లు పెంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలంటూ ఇటీవలే కోర్టు మెట్లు ఎక్కగా.. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే థియేటర్లపై అధికారుల దాడులు పెరిగిపోయాయి.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా60కిపైగా సినిమా థియేటర్లను అధికారులు మూసేశారు. నిబంధనలను పాటించకుండా థియేటర్లు కనిపిస్తే చాలు చర్యలు తీసుకుంటూ గెట్ రెడీ ఫోర్స్ అంటూ దూసుకెళ్లిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ఏపీ సర్కారు థియేటర్లను పూర్తిగా మూసేయించేంత వరకు శాంతించేలా కనిపించట్లేదు. మరి ఈ పరిస్తితి ఎప్పుడు సర్దుమనుగుతుందో తెలియాల్సి ఉంది.