థియేటర్లలో రోజుకు మూడు షోలే..!

దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడగా థియేటన్నీ మూతపడ్డాయి. లాక్డౌన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా సడలింపులు ఇస్తున్నాయి. దీంతో త్వరలోనే సినిమా షూటింగులు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈమేరకు టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గురువారం భేటి అయ్యారు. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విన్నవించారు. సినీ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రెండ్రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి […]

Written By: Neelambaram, Updated On : May 22, 2020 5:25 pm
Follow us on

దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడగా థియేటన్నీ మూతపడ్డాయి. లాక్డౌన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా సడలింపులు ఇస్తున్నాయి. దీంతో త్వరలోనే సినిమా షూటింగులు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈమేరకు టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గురువారం భేటి అయ్యారు. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విన్నవించారు. సినీ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రెండ్రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. సీని పెద్దలు కూడా కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.

తెలంగాణలో మే31 వరకు లాక్డౌన్ 4.0 కొనసాగనుంది. దీంతో జూన్లో సినిమా షూటింగులకు పర్మిషన్ వచ్చే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. అయితే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కన్పించడం లేదు. దీనిపై కూడా సినీపెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాలు సినీ ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉండటంతో ఆగస్టు నాటికి థియేటర్లు రీ ఓపెన్ అయ్యే అవకాశం ఉందనే ఆశాభావాన్ని సీని పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో థియేటర్స్ యాజమాన్యంతో సీనిపెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే దేశంలో లాక్డౌన్ ఎత్తివేసినా సాయంత్రం 7 గంటల తర్వాత యథావిధిగా కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉంది.

దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లో రోజుకు మూడు షోలు మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమా షూటింగుల విషయంలో ఒకటి రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు సినిమా షూటింగుల్లో తాము తీసుకోబోతున్న చర్యలపై ప్రభుత్వానికి ఓ ప్రజంటేషన్ ఇచ్చేందుకు టాలీవుడ్ పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రజంటేషన్ బాధ్యతలను దర్శకుడు రాజమౌళి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది.