Sukumar : ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకులకు తీసుకు వస్తున్న నేపధ్యంలో సుకుమార్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమాని భారీ సక్సెస్ గా మార్చడంలో సుకుమార్ తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే పుష్ప సినిమా పాన్ ఇండియాలో 1500 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందంటూ ఆయన ఒక భారీ ప్రణాళికను అయితే రూపొందించాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మినిమం గ్యారంటీ సినిమాగా ఇండస్ట్రీలో ఆడుతూ మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన తన తదుపరి సినిమాను కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి తెర మీదకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు రామ్ చరణ్ 130 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నారట. మరి మొత్తాకైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనను పరిచయం చేయడానికి సుకుమార్ భారీ ప్రణాళికలైతే రూపొందిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఒక భారీ కథను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ను మనం తొందర్లోనే చూడబోతున్నాం అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళ బాటలోనే వీళ్ళు కూడా నడుస్తున్నారు. ఇక వీళ్ళు తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చే సినిమా మరో రంగస్థలం అవుతుందా లేదా అనేది…