Kiran Abbavaram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు కిరణ్ అబ్బవరం… ఇక ఆయన ఈరోజు క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక డీసెంట్ సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా చివరి 20 నిమిషాలు సినిమాలోని ఒక అద్భుతాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం… ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ద్వారా ఒకప్పుడు తనను ట్రోల్ చేసిన ఒక ప్రొడక్షన్ హౌస్ కి భారీ కౌంటర్లు అయితే ఇచ్చాడు. నిజానికి కిరణ్ అబ్బవరం నుంచి ఒకప్పుడు వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉండేది. అదే విషయాన్ని హైలెట్ చేస్తూ ఛాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ హౌజ్ వాళ్ళు ఒక సినిమాలో అతన్ని ట్రోల్ చేశారు. ఇక అతని గెటప్ చేంజ్ లో గాని కథల ఎంపిక లో గాని, ఆయన ఎప్పుడు వైవిధ్యాన్ని చూపించలేకపోయాడు. దానివల్లే చాలామంది ప్రేక్షకులు కూడా అతన్ని విమర్శించారు. అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన తన పంథాను మార్చుకొని ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇచ్చాడు. దాంతో ప్రేక్షకులందరూ సినిమాకి ఫిదా అయిపోతున్నారు.
అలాగే కిరణ్ అబ్బవరం చేసిన ప్రయత్నానికి కూడా మెచ్చుకుంటూ అతన్ని టాప్ లెవెల్లో నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దానికోసమే ఈ సినిమాని చూడడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆయన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇచ్చిన స్పీచ్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. దానివల్ల మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి హీరోగా ఎందుకు ఎదగకూడదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.
అందువల్లే ఈ సినిమాని చూడడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మరొక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉన్నాయి. వాటి వల్ల ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అయితే తెచ్చుకుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…
నిజానికైతే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో సక్సెస్ ని కొడుతున్నామని చెప్పి మరి సక్సెస్ కొట్టాడు. ఈ సినిమా క్లైమాక్స్ ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాలేదని ఆయన చెప్పడం కూడా విశేషం. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది…