https://oktelugu.com/

Kiraack Boys Khiladi Girls: అనసూయను లైన్లో పెట్టే పనిలో శేఖర్ మాస్టర్… ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా మనసులో మాట బట్టబయలు!

హాట్ యాంకర్ అనసూయ పై కన్నేశాడు శేఖర్ మాస్టర్. ఆమెను లైన్లో పెట్టేందుకు పులిహోర కలుపుతున్నారు. ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ తీరుకు జనాలు అవాక్కు అవుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 26, 2024 / 05:25 PM IST

    Kiraack Boys Khiladi Girls

    Follow us on

    Kiraack Boys Khiladi Girls: శేఖర్ మాస్టర్ టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ ఫస్ట్ ఆప్షన్. ఆయనకు సోషల్ మీడియాలో కూడా బాగానే క్రేజ్ ఉంది. ఒకవైపు టెలివిజన్ షోలు మరోవైపు సినిమాలు రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఢీ, కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలు చేస్తున్నాడు. అమ్మాయిలతో పులిహోర కలపడంలో శేఖర్ మాస్టర్ ఒక అడుగు ముందే ఉంటాడు. సందు దొరికితే చాలు దూరిపోతుంటాడు. తాజాగా శేఖర్ మాస్టర్ టాలెంట్ చూపించాడు. అనసూయ ని పొగడ్తలతో ఐస్ చేశాడు.

    కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. ఈ షోలో శేఖర్ మాస్టర్ రచ్చ మామూలుగా ఉండదు. టాస్కుల పేరుతో అమ్మాయిలను ముద్దులు పెట్టుకోవడం, వారికి హగ్గులు ఇస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు. మొన్నామధ్య షర్ట్ విప్పి తెగ ట్రెండ్ అయ్యాడు. తాజాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పోటా పోటీగా సాగింది. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నువ్వా నేనా అంటూ సవాళ్లు విసురుకున్నారు.

    అమ్మాయిలు, అబ్బాయిలు ఇంత హీట్ మూమెంట్ లో ఉంటే… శేఖర్ మాస్టర్ మాత్రం కూల్ గా అనసూయని సైకిల్ ముందు కూర్చోబెట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. ఇక స్టేజి పైన కాసేపు వీళ్లిద్దరు ముచ్చట్లు పెట్టారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ వెళ్లి తన జడ్జి సీట్ లో కూర్చున్నాడు. ఏ మాటకు ఆ మాట నువ్వు స్టేజి మీదకు వస్తే స్టేజి అందంగా ఉంటుంది అంటూ అనసూయను పొగిడాడు. దీనికి అనసూయ తెగ సిగ్గు పడిపోయింది.

    మెలికలు తిరిగింది. శేఖర్ మాస్టర్ కి థాంక్స్ చెప్పింది. మీ పక్కన జడ్జి సీట్ లో కూర్చోవడానికి వెయిట్ చేస్తున్నాను అని అనసూయ చెప్పడం అక్కడ ఉన్న వాళ్లంతా అరిచి గోల చేయడం హైలెట్ గా నిలిచింది. ఈ వీడియో క్లిప్ అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. కాగా కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఆగస్టు 25న ముగిసింది. శేఖర్ మాస్టర్ టీం లీడర్ గా ఉన్న బాయ్స్ టీం విజేతలుగా నిలిచారు. కిర్రాక్ బాయ్స్ టైటిల్ తో పాటు రూ. 20 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.

    ఏడాదికి పైగా బుల్లితెరకు దూరమైన అనసూయ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. అలాగే ఇతర టెలివిజన్ షోలకు గుడ్ బై చెప్పింది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని పరోక్షంగా రెండు మూడు సందర్భాల్లో వెల్లడించింది. మనసు మార్చుకున్న అనసూయ స్టార్ మా ఛానెల్ లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ షోకి జడ్జిగా వచ్చింది.