Chiranjeevi- Puri Jagannadh: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లో నటుడు కూడా ఉన్నాడు. ఆయన గతంలోనే కొన్ని సినిమాల్లో అలా కనిపించి వెళ్లారు. అయితే, మెగాస్టార్ చిరంజీవితో పూరి నటించబోతున్నాడు. ఈ విషయాన్ని చిరు ట్వీట్ చేస్తూ ఒక మంచి మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు.

అయితే, ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే గాడ్ ఫాదర్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రతో పూరి జగన్నాధ్ ను నటుడిగా పరిచయం చేస్తున్నాం’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న క్రేజీ సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
కాగా పూరి తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. చిరు, పూరిలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో పూరి కూడా చిరు కోసం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, పూరి ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. నిజానికి పూరిది ఈ సినిమాలో చిన్న అతిథి పాత్ర మాత్రమే.
కానీ పూరి లాంటి దర్శకుడు ఒక్క క్షణం దర్శనమిచ్చినా ఆ సినిమాలో అది కీలకమే. ఏది ఏమైనా మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో పూరి ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి హీరోయిన్ గా లేడి సూపర్‌స్టార్ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో ఓ ప్రవేట్ ప్లేస్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్ లో మెగాస్టార్ తో పాటు సత్యదేవ్ కూడా పాల్గొన్నాడు. అన్నట్టు గంగవ్వ యూట్యూబ్ లో బిగ్ స్టార్. ఫ్రేమ్ లో ఆమె కనబడగానే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. అయితే, గంగవ్వ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోనే కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పైగా చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుందని వార్తలు వచ్చాయి.