Varun Lavanya Marriage: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇంట్లో ఏ వేడుకలు జరిగినా ఇంట్లో వాళ్లకు గిఫ్ట్ లు ఇస్తుంటారు. పుట్టిన రోజులు, పెళ్లి, పండుగలు ఇలా స్పెషల్ డేస్ లో అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలా ఎన్నో సార్లు చేసి వార్తల్లో నిలిచారు కూడా. మరి రీసెంట్ గా లవ్ బర్డ్స్ కాస్త భార్య భర్తలు అయిన సంగతి తెలిసిందే. అదే మన వరుణ్, లావణ్యలు పెళ్లి బంధంతో రీసెంట్ గానే ఒకటయ్యారు. ఈ మెగా కుటుంబంలోని మెగా ప్రిన్స్ కు ఈ ఇద్దరు స్టార్లు ఏం గిఫ్ట్ ఇచ్చారో ఓ సారి చూసేద్దాం..
అందరికీ గిఫ్టులు ఇచ్చే అన్నదమ్ములు కొడుకుకు ఇవ్వకుండా ఉంటారా? అయితే ఇటలీలోని టెస్కాన్ లో 120 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో కొత్త జంట ఒకటైంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాక్ టెయిల్ పార్టీ నుంచి మొదలు మెహందీ, హల్దీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. వీరిద్దరి పెళ్లి జరగకముందే అల్లు అర్జున్ ఇంటికి పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తమ్ముడి కొడుకుకు మెగాస్టార్ రెండు కోట్ల విలువ చేసే డైమండ్ ను బహుమతిగా అందించారట. పవన్ కళ్యాణ్ మాత్రం మెగా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన లావణ్యకు కార్లంటే ఇష్టమని.. ఆమెకు ఒక ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చారట.
బిజీ షెడ్యూల్ లో ఇటలీకి వెళ్లడమే కష్టం. అలాంటిది అందరూ వెళ్లి.. ఇలా కొత్త జంటను ఆశ్యర్యపరచడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎంతైనా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీనే అంటూ తెగ పొగిడేస్తున్నారు కూడా. సినిమాలు, రాజకీయాలు, కెరీర్ అంటూ మాత్రమే కాదు ఈ మెగా ఫ్యామిలీ కుటుంబానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటుంది. అలాంటి ఇంట్లోకి వెళ్లిన లావణ్య చాలా లక్కీ అంటూ కొనియాడుతున్నారు నెటిజన్లు.