Chiranjeevi: అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జానపద, గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. అయితే, ఈ ఉత్సవాలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు.
ఇక నెల 26, 27న రాజమండ్రిలో, అలాగే 29, 30న వరంగల్‌లో, హైదరాబాద్‌లో ఏప్రిల్1 నుంచి 3 వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే దేశం మన భారతదేశం అని చిరంజీవి పేర్కొన్నారు.
ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా భారత కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను జరుపుతోందని ఆయన అన్నారు. ఈ ఉత్సవాలను అందరం తిలకించి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించారు.
చిరు ఇంకా మాట్లాడుతూ.. అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండటం గర్వకారణం. వాటిని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉంది. ఎందుకంటే.. జానపద, గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు మనకు చాలా ముఖ్యం. వాటిని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావించడం శుభపరిణామం’ అని చిరు చెప్పుకొచ్చారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి.. మళ్ళీ సినిమాల్లోకి రాగానే.. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అసలు మెగాస్టార్ ఈ స్థాయిలో భారీ చిత్రాలను చాలా వేగంగా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, కాలం ఆయన్ని మళ్ళీ రంగుల ప్రపంచం వైపుకు నెట్టింది. పైగా వేగం రెట్టింపు చేసి వదిలినట్టు ఉంది. మెగాస్టార్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు.
Come, Let’s celebrate our Artists & Artisans.Let’s celebrate our Unity in Diversity! Let’s celebrate our vibrant #RashtriyaSanskritiMahotsav !@kishanreddybjp pic.twitter.com/wdd3c8AwfV
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 22, 2022