https://oktelugu.com/

Hero Prashanth: లేటు వ‌య‌సులో రెండో పెండ్లి చేసుకోబోతున్న జీన్స్ మూవీ హీరో.. అమ్మాయి ఎవ‌రంటే..?

Hero Prashanth: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన జీన్స్ మూవీ గురించి ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తే. అయితే ఈ మూవీలో హీరోగా న‌టించిన ప్ర‌శాంత్ కూడా ఆ మూవీ త‌ర్వాత చాలా ఫేమ‌స్ అయ్యాడు. త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయారు. కానీ ఆయ‌న స్టార్ హీరోగా మాత్రం రాణించ‌లేక‌పోయారు. ఇక మ‌న తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన విన‌య విధేయ రామ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. కాగా ఇప్పుడు కూడా […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 23, 2022 / 12:23 PM IST
    Follow us on

    Hero Prashanth: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన జీన్స్ మూవీ గురించి ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తే. అయితే ఈ మూవీలో హీరోగా న‌టించిన ప్ర‌శాంత్ కూడా ఆ మూవీ త‌ర్వాత చాలా ఫేమ‌స్ అయ్యాడు. త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయారు. కానీ ఆయ‌న స్టార్ హీరోగా మాత్రం రాణించ‌లేక‌పోయారు. ఇక మ‌న తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన విన‌య విధేయ రామ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించారు.

    Hero Prashanth

    కాగా ఇప్పుడు కూడా వ‌రుస సినిమాల‌తో ఆయ‌న బిజీగా మారిపోతున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఆయ‌న గురించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో సంచ‌ల‌నం రేపుతోంది. 48 ఏండ్ల వ‌య‌సులో ఉన్న ప్ర‌శాంత్‌.. త్వ‌ర‌లోనే రెండో పెండ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. 2005లో ఆయ‌న‌కు గృహ‌ల‌క్ష్మీ అనే అమ్మాయితో పెండ్లి అయింది.

    Also Read: Bollywood Trends : బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్

    కొత్త‌లో వీరిద్ద‌రూ అన్యోన్యంగానే జీవించే వారు. వారికి ఏడాదిలోనే బాబు కూడా పుట్టాడు. కానీ సంసారం అన్న త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు కామ‌న్ క‌దా. అవే వారిని విడ‌దీశాయి. దీంతో ఇద్ద‌రూ విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. ఆ బాధ‌లో ప్ర‌శాంత్ సినిమా అవ‌కాశాలు వ‌చ్చినా కూడా చేయ‌లేదంట‌. కానీ ఇన్నేండ్ల త‌ర్వాత ఆయ‌న రెండో పెండ్లికి రెడీ అవుతున్నారంట‌.

    Hero Prashanth

    ఆయ‌న త‌న ఫ్యామిలీ ఫ్రెండ్‌నే పెండ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అటు వ‌రుస సినిమాల్లో కూడా బిజీగా మారాల‌ని చూస్తున్నారు ప్ర‌శాంత్‌. ఓ త‌మిళ రీమేక్ మూవీని చేసేందుకు కూడా ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంట‌. మ‌రి ఈ వ‌య‌సులో ఆయ‌న రెండో పెండ్లి చేసుకుని షాక్ ఇస్తారా లేదా అన్న‌ది మాత్రం వేచి చూడాలి.

    Also Read: Ramarao On Duty Release Date: జూన్ 17న ‘రామారావు ఆన్ డ్యూటీ’.. సక్సెస్ కొడతాడా ?

    Tags