https://oktelugu.com/

Chiranjeevi : అభిమానితో ఉత్తరాంధ్ర యాసలో చిరంజీవి ఫన్నీ జోకులు..ఆడిటోరియం మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యాన్స్, ఫైట్స్ , యాక్షన్ అద్భుతంగా చేసే చిరంజీవి కామెడీ ని అంతకంటే అద్భుతంగా చేసేవాడు

Written By: , Updated On : November 13, 2024 / 12:05 PM IST
Chiranjeevi's funny jokes in Uttarandhra accent with a fan..the whole auditorium burst into laughter!

Chiranjeevi's funny jokes in Uttarandhra accent with a fan..the whole auditorium burst into laughter!

Follow us on

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యాన్స్, ఫైట్స్ , యాక్షన్ అద్భుతంగా చేసే చిరంజీవి కామెడీ ని అంతకంటే అద్భుతంగా చేసేవాడు. అందుకే ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. అయితే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ఎవ్వరూ రప్పించుకోలేకపోయారని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లోని వింటేజ్ కామెడీ టైమింగ్ లో డైరెక్టర్ ఒక 50 శాతం ఉపయోగించుకున్నాడు కానీ, పూర్తి స్థాయిలో రాబట్టలేదని అభిమానుల అభిప్రాయం. అయితే చిరంజీవి బయట ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో కొన్ని సందర్భాల్లో చూపించే కామెడీ టైమింగ్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత టైమింగ్ ని ఈమధ్య సినిమాల్లో ఎందుకు చూపించట్లేదు బాసూ అంటూ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేస్తుంటారు.

నిన్న ప్రముఖ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘సత్యదేవ్ నాకు మూడవ తమ్ముడి లాంటి వాడు. అతను ఫోన్ చేసి ప్రేమగా అన్నయ్య, ఇలా మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తావా అని పిలిచాడు. క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేస్తాను అని చెప్పాను. ప్రేమగా పిలిస్తే నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, చిన్నవాళ్లు, పెద్దవాళ్ళు అని చూడను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ఇలా ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక అభిమాని ‘బాసూ..నిన్ను చూసేందుకు నేను వైజాగ్ నుండి వచ్చాను’ అని పెద్దగా అరిచి చెప్తాడు.

ఇది విన్న చిరంజీవి ‘అయితే ఏటి సెయ్యమంటావ్..నువ్వు అంత దూరం నుండి వచ్చావు సంతోషమే..కానీ ఈ బొమ్మని నువ్వు వైజాగ్ లో ఆడించాలి..మన హీరోది కూడా వైజాగే..భలేవాడివి..కూర్చొని వినురా బాబు’ అని అంటాడు చిరంజీవి. ఆయన మాట్లాడిన ఈ మాటలకు ఆడిటోరియం మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోతుంది. చాలా కాలం తర్వాత సత్యదేవ్ నుండి వస్తున్నా ఈ చిత్రం 22వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది. టీజర్,ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, ప్రముఖ దర్శకుడు వసిష్ఠ దర్శకత్వంలో ఆయన ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున