Chiranjeevi : స్టార్స్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై జనాల్లో, అభిమానుల్లో ఆసక్తి ఉంది. వాళ్ళు ఏం తింటారు? ఎలా ఉంటారు? లైఫ్ స్టైల్, ఫ్యాషన్, ఫుడ్ హ్యాబిట్స్… ఇలా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్టైల్, మేనరిజం ఫాలో అవుతూ ఉంటారు. సందర్భం దొరికితే, ఆయన గురించి తమకు తెలియని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కాగా గతంలో ఓ కార్యక్రమంలో చిరంజీవిని సుమ కొన్ని ప్రశ్నలు అడిగారు.
ఆ ప్రశ్నలు అభిమానులు రాసినవి. ఓ అభిమాని.. నాటు కోడి, చేపల పులుసు.. ఈ రెండింటిలో మీకు ఇష్టమైనది ఏది? అని సుమ అడిగారు. వింటుంటే నోరు ఊరుతుంది. ఈ రెండు కూరలు నాకు ఇష్టమైనవే, అన్నారు. ఒకటి చెప్పాల్సి వస్తే మాత్రం చేపల పులుసు నాకు ఆల్ టైం ఫేవరేట్ ఫుడ్ అని చిరంజీవి అన్నారు. అందులోను తల్లి అంజనా దేవి చేసిన చేపల పులుసును చిరంజీవి అమిత ఇష్టంగా తింటారట.
కాగా కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఇంటికి పరిమితమైన చిరంజీవి చింత చిగురుతో చేపల వేపుడు చేశాడు. అనంతరం తల్లికి స్వయంగా తినిపించాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మొగల్తూరులో పుట్టిన చిరంజీవికి బాల్యం నుండి చేపల కూర అంటే మక్కువ అని సమాచారం. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. పోస్ట్ పోన్ అయ్యింది.
ఇటీవల చిరంజీవి అనారోగ్యం బారిన పడ్డారు. జ్వరం రావడంతో ఒక నెల రోజులు షూటింగ్ కి హాజరు కాలేదు. ఈ కారణంగా మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్రిష ప్రధాన హీరోయిన్ గా చేస్తుంది. చాలా ఏళ్ల అనంతరం త్రిష-చిరు కాంబో రిపీట్ అయ్యింది. సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో రూపొందిస్తున్నారు. విశ్వంభర చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన విశ్వంభర టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
Web Title: Chiranjeevis favorite food is fish soup made by anjana devi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com