https://oktelugu.com/

‘ఆచార్య’ రీ స్టాట్ ఎప్పుడంటే?

దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదాపడగా, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో బేటీ అయి షూటింగులు ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లతో వరుసగా బేటీలు నిర్వహించారు. సినీ పెద్దల సమస్యలను విన్న కేసీఆర్ సినిమా పోస్టు ప్రొడక్షన్, షూటింగులకు గ్రీన్ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో షూటింగులకు అనుమతి ఇచ్చారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 26, 2020 / 02:05 PM IST
    Follow us on


    దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదాపడగా, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో బేటీ అయి షూటింగులు ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లతో వరుసగా బేటీలు నిర్వహించారు. సినీ పెద్దల సమస్యలను విన్న కేసీఆర్ సినిమా పోస్టు ప్రొడక్షన్, షూటింగులకు గ్రీన్ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో షూటింగులకు అనుమతి ఇచ్చారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ తరఫున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎట్టకేలకు షూటింగులకు అనుమతి రావడంతో టాలీవుడ్లో సందడి మొదలైంది.

    అయితే సినిమా షూటింగులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది దానిపై టాలీవుడ్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తిరిగి సినిమాలను ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు సన్నద్దమవుతోన్నారు. ఈనేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ మూవీని రీ స్టాట్ చేసేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నహాలు చేస్తున్నారు. సినిమా షూటింగులను ఏవిధంగా ప్రారంభించాలనేది మెగాస్టార్ తన మూవీ ద్వారా ఇతర దర్శక, నిర్మాతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జూన్ 15నుంచి ‘ఆచార్య’ మూవీ పట్టాలెక్కబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది. దాదాపు రెండునెలలుగా షూటింగులు బంద్ అవడంతో సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మూవీని ప్రారంభిస్తే టాలీవుడ్లో ఓ కొత్త జోష్ వస్తుందని కార్మికులు, అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలక పాత్రల్లో నటించనున్నాడు. మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ మూవీని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.