Chiranjeevi-Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఒకే ఒక్క హీరో చిరంజీవి.. ఈయన ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.ఇక ఆయన రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించిన హీరో ఈ జనరేషన్ లో మరొకరు లేరు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి చిరంజీవి అంటే ఏ పాత్రనైనా అలవోకగా చేసే ఒక డైనమిక్ యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు.
ఇక ఆయన ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. అయితే అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికి నటుడుగా మాత్రం ఆయన ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. అందువల్లే ఆయన ఇండస్ట్రీ లో ఇన్ని సంవత్సరాలపాటు మెగాస్టార్ గా వెలుగొందుతున్నారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో మన ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక దానికి బివిఎస్ రవి కథను కూడా సమకూర్చాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఒకటి లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి త్రిబుల్ రోల్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందులో ఒకటి ముసలి గెటప్ కూడా ఉందట. ఇక ఇంతకు ముందు హరీష్ శంకర్ ని చిరంజీవితో ఎలాంటి సినిమా చేస్తారు అని అడిగినప్పుడు దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాని చేస్తానని ఆయన తెలియజేశాడు.
ఇక ఇప్పుడు ఈ సినిమాని కూడా అలాగే కమర్షియల్ వే లో ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో ‘మిస్టర్ బచ్చన్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేసి ఆ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత చిరంజీవి తో సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక విశ్వంభర సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి హరీష్ శంకర్ డైరెక్షన్ లో చెయ్యబోయే పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…