Chiranjeevi vs Mohanlal : ఇప్పటివరకు ఎంతమంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక మిగతా యంగ్ హీరోలు సైతం భారీ రేంజ్ లో ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా గొప్ప స్థాయిలో నిలుచోబెట్టాయి. మరి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినప్పటికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మొత్తానికైతే ఈ సినిమాను తొందర్లోనే మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి మొదటి నుంచి కూడా కమర్షియల్ సినిమాలోనే చేస్తున్నాడు.ఆ సినిమాలతోనే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆయన ఆ సినిమాలనే చేస్తు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్ లాంటి నటుడు రీసెంట్గా ‘తుడరుమ్ ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో ఆయన నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మంచి సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇలాంటి సినిమాలను చిరంజీవి ఎందుకు చేయడం లేదు.
కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. చిరంజీవి కూడా లో బడ్జెట్లో సినిమాలు చేసి మంచి విజయాన్ని సాధించి కొత్త రికార్డులను క్రియేట్ చేయొచ్చు కదా అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి చిరంజీవి కూడా కెరియర్ మొదట్లో ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేసినప్పటికి అవి ప్రేక్షకుల ఆదరణ పొందలేదు.
దాంతో ఆయన అప్పటినుంచి ప్రయోగాత్మకమైన సినిమాలు కాకుండా కమర్షియల్ సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆనందపడతారు. తన నుంచి వాళ్ళు అదే కోరుకుంటున్నారు అనే ఉద్దేశ్యంతో ఆయన కమర్షియల్ సినిమాలను ఎంచుకొని వరుసగా సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు…