Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Vishwambhara Update: విశ్వంభర మీద చిరంజీవికి ఇంకా నమ్మకం రాలేదా..? మెగాస్టార్ కోరుకునేది ఇదే...

Chiranjeevi Vishwambhara Update: విశ్వంభర మీద చిరంజీవికి ఇంకా నమ్మకం రాలేదా..? మెగాస్టార్ కోరుకునేది ఇదే…

Chiranjeevi Vishwambhara Update: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటే అప్పుడు ఏదో ఒక చిన్న అవకాశమైతే వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని సక్సెస్ ఫుల్ గా వాడుకున్న వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును లభిస్తుంది. అలాంటి వారికే ఇండస్ట్రీలో తనదైన రీతిలో చోటు దక్కుతుంది… ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వశక్తితో వచ్చి ఇక్కడ స్టార్ హీరోగా స్థిరపడిన […]

Chiranjeevi Vishwambhara Update: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటే అప్పుడు ఏదో ఒక చిన్న అవకాశమైతే వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని సక్సెస్ ఫుల్ గా వాడుకున్న వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును లభిస్తుంది. అలాంటి వారికే ఇండస్ట్రీలో తనదైన రీతిలో చోటు దక్కుతుంది… ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వశక్తితో వచ్చి ఇక్కడ స్టార్ హీరోగా స్థిరపడిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి…

ఇక ఈ సంవత్సరం ఇప్పటికే మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన చిరంజీవి మరోసారి విశ్వంభర సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్నిసాధిస్తుందని ప్రేక్షకులందరు నమ్మినప్పటికి ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అంతా బాగా రాలేదట.

దానివల్ల మరో కంపెనీతో సిజి వర్క్ చేయించారు. అది కూడా అంత ఇంప్రెస్సివ్ గా లేకపోవడంతో చిరంజీవి దీని మీద కొంత వరకు డైలమాను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికైనా ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? లేదంటే ఇంకాస్త రోజులు లేట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…ఇక రీసెంట్ గా చిరంజీవికి మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సక్సెస్ వచ్చింది.

కాబట్టి ఆ సక్సెస్ తర్వాత విశ్వంభర సినిమాతో మరో ఫ్లాప్ వస్తే బాగుండదనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆలోచిస్తున్నారట. కానీ ఇప్పటికే ఈ సినిమా మీద అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ అయింది. దానివల్ల సినిమా సక్సెస్ అయిన కూడా లాభాలు వస్తాయనే గ్యారంటీ లేదు. దాంతో ఈ సినిమాని వీలైనంత తొందరగా రిలీజ్ చేస్తేనే మంచిది. ఆ మాత్రం బజ్ అయిన ఉంటుంది. లేకపోతే అది కూడా ఉండదు అంటు మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper