Chiranjeevi Vishwambhara Glimpses: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘విశ్వంభర'(Viswambhara Movie) చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవుతుందని ఈరోజు ఉదయం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో బైట్ ద్వారా తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. సెకండ్ హాఫ్ మొత్తం VFX మీద ఆధారపడడంతో క్వాలిటీ విషయం లో ఎక్కడ రాజీ పడకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఎక్కువ సమయం తీసుకుంటున్నామని. ఈరోజు సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నామని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్టు గానే కాసేపటి క్రితమే ఈ గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. గత ఏడాది విడుదల చేసిన టీజర్ ని నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. కానీ ఈసారి మాత్రం ట్రోలింగ్స్ కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా చాలా అద్భుతంగా కట్ చేసారు. ఓవరాల్ గా గ్లింప్స్ వీడియో ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి.
Also Read: పూర్తిగా తమిళ సినిమాలాగా మార్చేసిన అట్లీ..అల్లు అర్జున్ పొరపాటు చేశాడా?
ముందు గా ఒక చిన్న పాప ‘ఈ విశ్వంభర లో అసలు ఏమి జరిగిందో ఇప్పుడైనా చెప్పు తాత’ అని అంటుంది. విశ్వంభర అంటే ఒక ప్రత్యేకమైన లోకం అని డైరెక్టర్ వశిష్ఠ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్తాడు. హీరోయిన్ కోసం 7 లోకాలు దాటి హీరో వెళ్లిన ప్రయాణమే ఈ చిత్రం అని చెప్తాడు. ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ని చూస్తే డైరెక్టర్ చెప్పినట్టు గానే సినిమా ఉంది అనిపించింది. ఒకరి స్వార్థం కోసం ‘విశ్వంభర’ లో ఒక విద్వంసం జరిగిందని, ఆ విద్వంసం హీరో క్యారక్టర్ వల్ల జరిగిందా?, తన సతీమణి ని తీసుకొని వెళ్లడం కోసం జరిగిందా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. గ్లింప్స్ ప్రారంభం లో ఒక స్కార్పియో ని చూపిస్తారు.
అది కూడా విశ్వంభర కి చేరుకునే ప్రయాణం లో మధ్యలో వచ్చే లోకం అట. అలాంటి విచిత్రమైన లోకాలు సినిమాలో చాలానే ఉన్నాయని సమాచారం. అంతే కాదు చివర్లో చిరంజీవి చేతిలో ఒక కన్ను ఉండడం కూడా ఎదో ఆసక్తి కరమైన అంశం ఉన్నట్టుగా అనిపించింది. ఒక్క మాట లో చెప్పాలంటే ఇది ఒక చందమామ కథ. డైరెక్టర్ ఎంత అద్భుతంగా తీస్తే, సినిమా ఆ రేంజ్ లో పేలుతుంది. అయితే ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ లో విజువల్స్ బాగానే ఉన్నాయి కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎందుకో డల్ గా ఉన్నట్టు అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరకు మొదటి టీజర్ లోనిదే బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియచేయండి.