Mana Shankar Varaprasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ నుండి రాబోతున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు మొదటి నుండి భారీగానే ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడంతో పాటు,విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమా షూటింగ్ లో భాగం అవ్వడం తో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం బట్టీ చూస్తుంటే ఇది సోలో చిరంజీవి సినిమా అని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఇందులో వెంకటేష్ అతిథి పాత్రలో మాత్రం కనిపించడం లేదట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న విషయం.
సెకండ్ హాఫ్ లో దాదాపుగా వెంకటేష్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుందట. దాదాపుగా సెకండ్ హాఫ్ మొత్తం ఉంటాడట. ఉదాహరణకు ‘గోపాల గోపాల’, ‘బ్రో ది అవతార్’ వంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉంటుందో, ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర నిడివి అంత ఉంటుందట. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ విషయం లో చిరంజీవి అనేక విమర్శలు ఎదురుకున్నాడు. చిరంజీవి సొంతంగా సూపర్ హిట్ ని కొట్టలేడా?, రవితేజ సహాయం తీసుకొని సూపర్ హిట్ కొట్టాలా?, సినిమా కూడా రవితేజ ఉన్నంతసేపు మాత్రమే బాగుంది, ఇక ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ చిరంజీవి కి ఎలా వస్తుంది?, ఆయన గొప్పదనం ఏముంది అంటూ సోషల్ మీడియా లో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా ఇలాంటి విమర్శలనే ఎదురుకోవాల్సి వస్తుందా? అంటే కచ్చితంగా అవుననే చెప్పాలి.
చిరంజీవి కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చిరంజీవి కంటే వెంకటేష్ కి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ కొద్దిగా ఎక్కువ. పైగా ఆయన ఈ సంక్రాంతికి సోలో హీరో గా వచ్చి 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టాడు. సినిమాలో ఎదో అతిథి పాత్ర అంటే చిరంజీవి కి సోలో గా క్రెడిట్ ఇవ్వడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం వెంకటేష్ ఉంటాడు అంటున్నారంటే కచ్చితంగా ఇది సోలో చిరంజీవి సినిమా కాదు, మల్టీస్టార్రర్ సినిమానే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. అంతే కాదు వెంకటేష్ కి ఒక సెపెరేట్ సాంగ్ , ఫైట్ కూడా ఉంటుందని టాక్. రేపు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మరో 300 గ్రాస్ ని రాబట్టొచ్చు. కానీ కచ్చితంగా క్రెడిట్ సోలో గా చిరంజీవి కి రాదు అనేది విశ్లేషకుల వాదన.