Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Bobby Movie: చిరంజీవి డైరెక్టర్ బాబీ ని బ్లైండ్ గా నమ్మడానికి కారణం ఇదే...

Chiranjeevi Bobby Movie: చిరంజీవి డైరెక్టర్ బాబీ ని బ్లైండ్ గా నమ్మడానికి కారణం ఇదే…

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన దైన రీతిలో సత్తా చాటుతున్న ఏకైక హీరో చిరంజీవి కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో […]

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన దైన రీతిలో సత్తా చాటుతున్న ఏకైక హీరో చిరంజీవి కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ కి భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక దాంతో ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతుంది. చిరంజీవి సైతం బ్లైండ్ గా బాబి ని నమ్ముతున్నాడట.

తను ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కథని ఫైనల్ చేసిన చిరంజీవి చాలా అద్భుతంగా కథ కుదిరిందని చెప్పాడట…అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందని బాబీ తో చెప్పారట. ఇక బాబీ సైతం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు…

ఇక చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి రాబోయే సినిమాలన్నింటితో సక్సెస్ లను సాధించాలి. తప్ప డిజాస్టర్ సినిమాలు చేయకూడదనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ది బెస్ట్ స్క్రిప్ట్ లను ఎంచుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. బాబీ సైతం గత సంవత్సరం చేసిన ‘డాకు మహారాజ్’ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక బాబీ డైరెక్షన్లో చిరంజీవి సినిమా అంటే మామూలుగా ఉండదు అనే ఒక నమ్మకం అయితే ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది… మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper