https://oktelugu.com/

Chiranjeevi Tribute To The Sr NTR: ఆ మహానుభావుడి ఇదే నా ఘన నివాళి – చిరంజీవి

Chiranjeevi Tribute To The Sr NTR: తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. నేడు ఆయన జయంతి. తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు ఎన్టీఆర్. అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇంతకీ మెగాస్టార్ ఏమి ట్వీట్ చేశారు అంటే.. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే […]

Written By:
  • Shiva
  • , Updated On : May 28, 2022 / 04:37 PM IST
    Follow us on

    Chiranjeevi Tribute To The Sr NTR: తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. నేడు ఆయన జయంతి. తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు ఎన్టీఆర్. అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

    Chiranjeevi

    ఇంతకీ మెగాస్టార్ ఏమి ట్వీట్ చేశారు అంటే.. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’ అని పోస్ట్ చేశారు.

    గత జయంతి నాడు కూడా చిరు ప్రభుత్వాలకి ఒక విన్నపం చేశారు. ఎన్టీఆర్ అంటే.. తెలుగు సినిమా స్థితని , తెలుగు రాజకీయాల గతిని మార్చిన ఒక శక్తి, అంత గొప్ప మహానుభావుడికి భారత రత్న రాకపోవడం నిజంగా భారతరత్నకే అది అవమానం. అందుకే మెగాస్టార్ లాంటి హీరోలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగానైనా ఆయనకు భారతరత్న వచ్చేలా చూడాలని మెగాస్టార్ కోరారు.

    Sr NTR, Chiranjeevi

    Also Read: Mahesh Babu : ‘సర్కారు’ 16 రోజుల కలెక్షన్స్.. ఇదే చివరి అవకాశం !

    అయితే, ఎన్టీఆర్ కి భారతరత్న రావాలి అనే చిరు కోరిక ఎప్పటికైనా తిరుగుతుందా ? నేటి రాజకీయ అవసరాలను బట్టి బిరుదులు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎన్టీఆర్ భారత రత్న ఇస్తారా ? అయినా ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే ఎన్నో గొప్ప బిరుదులు వచ్చినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు.

    తనకు ప్రజల అభిమానమే నిజమైన అవార్డు అని ఎన్టీఆర్ ఎప్పుడూ భావించేవారు. ఆయన ఈ లోకాన్ని విడిచి పదుల సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆయనను తెలుగు ప్రజలు తమ హృదయాల్లో ఇప్పటికీ శాశ్వతంగా బంగారు ముద్ర రూపంలో భద్రపరుచుకున్నారు. కాగా నేడు ఆయన జయంతి కావడంతో యావత్తు అభిమాన లోకంతో పాటు సినీ లోకం కూడా ఆయనను స్మరించుకుంటున్నారు.

    Also Read: kangana Ranaut: అయ్యో కంగనా, మరీ ఇంత దారుణమా ! దేశమంతా కలిపి ఇరవై టికెట్లేనా !!!!

    Tags