https://oktelugu.com/

Celebrities Remembering Sr NTR: ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖులు

Celebrities Remembering Sr NTR: ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్ ల పై మీరు ఒక లుక్కేయండి. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను” – జూనియర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 28, 2022 / 04:51 PM IST

    N T Rama Rao

    Follow us on

    Celebrities Remembering Sr NTR: ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్ ల పై మీరు ఒక లుక్కేయండి.

    Taraka Rama Rao

    “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను” – జూనియర్ ఎన్టీఆర్

    NTR

    తెలుగు భాషని, తెలుగు వాడిని, తెలుగు నాడు ని దశదిశలా తలేతుకునేలా చేసిన మహనీయుడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని నినాడించిన నాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న, శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఇదే నా మనఃపూర్వక నివాళి – విక్టరీ వెంకటేష్

    Venkatesh

    యుగానికొక్కడు, తెలుగు జాతికొక్కడు, చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడు..
    బడుగు వర్గాలను అందలం ఎక్కించావ్, యువతకు పట్టం కట్టావ్, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చావ్..
    మళ్ళీ పుట్టవా రామయ్య.. వందేళ్లు కాదు, వెయ్యేళ్ళు మరువలేమురా – నటుడు చలపతిరావు

    Chalapathi Rao

    Also Read: Chiranjeevi Tribute To The Sr NTR: ఆ మహానుభావుడి ఇదే నా ఘన నివాళి – చిరంజీవి

    ‘ఆంధ్రుల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్. ఫిల్మ్ నగర్ రోడ్డుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి’ – ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

    Tammareddy Bharadwaja

    రాజకీయంగా వినూత్న పథకాలు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. పేదల కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తెచ్చారు. ఎన్టీఆర్ మనతోనే ఉన్నారు. ఎన్టీఆర్ మీద రాసిన పుస్తకమే నా ఆఖరు పుస్తకం’ – పరుచూరి గోపాలకృష్ణ.

    Paruchuri Gopala Krishna

    Also Read: Yuga Purushudu NTR: యుగపురుషుడు ఎన్టీఆర్ కి అభిమానుల నీరాజనాలు !

    Tags