https://oktelugu.com/

Megastar Chiranjeevi : పెద్ద కూతురు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి.. 

ఈ నేపథ్యంలో చిరంజీవి తన పెద్ద కూతురుకు ఇక నుంచి పెద్ద బాధ్యతలు అప్పజెప్పనున్నారు. తాను నటించబోయే చిత్రాలన్నింటికీ సుస్మిత సేన్ ను నిర్మాతగా వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 25, 2023 / 02:15 PM IST
    Follow us on

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజివీ ఎవర్ గ్రీన్ హీరోగా కొనసాగుతున్నాడు. అప్పటికీ.. ఇప్పటికీ.. అన్నట్లు ఆరుపదుల వయసులోనే యంగ్ హీరోలకు పోటీఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరిసారిగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెక్ట్స్ మూవీ ‘భోళా శంకర్’తో వెండితెరపై కనిపించనున్నాడు. ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.  కుమారుడు రామ్ చరణ్ స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తండ్రి కావడంతో కుటంబ సభ్యులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక తాజాగా పెద్ద కూతురు కోసం చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
    చిరంజివి పెద్ద కూతురు సుస్మిత గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన సినిమాలకు దాదాపు ఆమె కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. రీసెంట్ గా ‘వాల్తేరు వీరయ్య’కు కూడా ఆమె ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకు ‘సేనాపతి’, ‘షూట్ అవుట్ ఎట్ అలేర్’ అనే వెబ్ సిరీస్ లను నిర్మించారు. అలాగే సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాకు నిర్మాతగా పనిచేశారు.
    ఈ నేపథ్యంలో చిరంజీవి తన పెద్ద కూతురుకు ఇక నుంచి పెద్ద బాధ్యతలు అప్పజెప్పనున్నారు. తాను నటించబోయే చిత్రాలన్నింటికీ సుస్మిత సేన్ ను నిర్మాతగా వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కుమారుడు రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమాకు నిర్మాత గా వ్యవహరించారు. ఇప్పుడు పెద్ద కూతురును కూడా నిర్మాణ రంగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాడు. దీంతో కొడుకు, కూతురు నిర్మాతలుగా వ్యవహరిస్తారన్నమాట.
    ఇటీవల ఇంట్లోకి ప్రిన్సెన్ ఎంట్రీ ఇచ్చిన ఆనందంలో ఉన్నారు మెగా ఫ్యామిలీ. ఇప్పుడు లేటేస్టుగా తన కూతురు విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న చిరంజీవిని గురించి అసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక మెగాస్టార్ లేటేస్టుగా నటించిన ‘భోళా శంకర్’ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మెగా ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇందులో తమన్నాతో పాటు కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.