Chiranjeevi On Rajasekhar: రాజశేఖర్ ని ఆదుకుంటున్న చిరంజీవి…కారణం ఏంటంటే..?

ఇప్పటికే నితిన్ హీరోగా, వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటించినప్పటికీ అది పెద్దగా సక్సెస్ సాధించలేదు. దాంతో ఆయనకు ఏమాత్రం పేరైతే రాలేదు. ఇక దానితో ఇప్పుడు పెద్ద సినిమాలు చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

Written By: Gopi, Updated On : January 26, 2024 12:03 pm
Follow us on

Chiranjeevi On Rajasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రాజశేఖర్… ఆయన హీరో గా చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వం లో ఆయన చేసిన అంకుశం సినిమాలో ఆయన పోషించిన యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ఆయనకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి ప్రియుడు సినిమాతో కూడా తనని తను లవర్ బాయ్ గా పరిచయం చేసుకున్నాడు.

అయితే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఒకప్పుడు ఆయనకు హీరోగా మంచి డిమాండ్ అయితే ఉండేది. అయితే మధ్యలో చిరంజీవితో కొన్ని విభేదాలు పెట్టుకోవడం, ఆయన చేసిన సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆడకపోవడంతో నెమ్మదిగా ఆయన మార్కెట్ డౌన్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆయనకు హీరోగా మార్కెట్ మొత్తం డౌన్ అవ్వడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇక ఇప్పటికే నితిన్ హీరోగా, వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటించినప్పటికీ అది పెద్దగా సక్సెస్ సాధించలేదు. దాంతో ఆయనకు ఏమాత్రం పేరైతే రాలేదు. ఇక దానితో ఇప్పుడు పెద్ద సినిమాలు చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. జగపతి బాబు కి లెజెండ్ సినిమాతో ఎలాంటి క్రెడిట్ అయితే వచ్చిందో ప్రస్తుతం రాజశేఖర్ కూడా అలాంటి క్రేజ్ ని దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టు గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక్కసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం దొరికింది అంటే మన సత్తా చూపించుకుంటూ ప్రేక్షకులను మెప్పించవచ్చు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు చిరంజీవి హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా రాబోతుంది.

ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం రాజశేఖర్ ని తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి చిరంజీవి విశ్వంభర అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మారుతి తో ఒక సినిమా చేయడానికి అయితే కమిట్ అయ్యాడు. ప్రస్తుతం మారుతి ప్రభాస్ తో చేస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత చిరంజీవితో సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలో ఒక పాత్ర కోసం రాజశేఖర్ ని తీసుకుంటే బాగుంటుందని మారుతి చెప్పడంతో చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా వార్తలైతే వస్తున్నాయి. ఇక చిరంజీవి కి రాజశేఖర్ కి మధ్య అప్పట్లో కొన్ని విభేదాలు వచ్చాయి. అయినప్పటికి చిరంజీవి మనసులో ఏమి పెట్టుకోకుండా రాజశేఖర్ కెరియర్ ని గాడిలో పెట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది…