Chiranjeevi , Suman
Chiranjeevi and Suman : చిరంజీవి-సుమన్ లలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. వీరిద్దరూ సినిమా నేపథ్యం లేని కుటుంబాల నుండి వచ్చారు. ఎవరి మద్దతు లేకుండా టాలెంట్ తో స్టార్స్ అయ్యారు. ఇద్దరిలో కొన్ని అసాధారణ క్వాలిటీస్ ఉన్నాయి. చిరంజీవి డాన్సులలో నెంబర్ వన్. అప్పటి వరకు ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ డాన్స్ తెలిసిన స్టార్ హీరో లేరు. అది చిరంజీవికి చాలా ప్లస్ అయ్యింది. భరతనాట్యం నేర్చుకోవడం వలన, చిరంజీవి డాన్సులలో అద్భుతమైన గ్రేస్ ఉండేది. మరోవైపు సుమన్ గొప్ప ఫైటర్. సుమన్ యాక్షన్ ఎపిసోడ్స్ యాక్షన్ ప్రియులకు ట్రీట్ అని చెప్పాలి. కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతుడైన సుమన్ సిల్వర్ స్క్రీన్ పై తన ఫైట్స్ తో ప్రేక్షుకులను మెప్పించాడు.
Also Read : ఆ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్, ఇక చిరంజీవి బాలీవుడ్ కి వెళ్లిపోవాలని అనుకున్నాడా?
ఈ క్రమంలో చిరంజీవి-సుమన్ చిత్రాల బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించేవి. సుమన్-చిరంజీవి స్టార్స్ గా ఎదుగుతుండగా, వారి మధ్య గట్టి పోటీ కనిపించేది. అనూహ్యంగా సుమన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. నీలి చిత్రాల కేసులో సుమన్ అరెస్ట్ అయ్యాడు. సుమన్ జైల్లో ఆరు నెలలు ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమాలు ఆగిపోయాయి. నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. విడుదలయ్యాక సుమన్ తిరిగి తన చిత్రాలు పూర్తి చేశాడు. అరెస్ట్ తర్వాత సుమన్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగలేదు. హిట్స్ పడ్డప్పటికీ స్టార్ అయ్యే ఛాన్స్ కోల్పోయాడు.
కాగా అప్పట్లో చిరంజీవి మీకు పోటీ కదా? మీరు అలా ఫీల్ అయ్యేవారా? అని అడగ్గా.. చిరంజీవిని నేను ఎప్పుడూ పోటీగా భావించలేదు, అని సుమన్ సమాధానం చెప్పారు. ఎందుకంటే.. నేను సినిమాల్లోకి రావడమే నాటకీయంగా జరిగింది. నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పరిశ్రమలో లేరు. నేను సినిమాల్లోకి రావడమే ఒక అద్భుతం. నా సినిమాలతో పాటు చిరంజీవి సినిమాలకు మంచి వసూళ్లు వచ్చేవి. ఆ విధంగా అనుకోకుండా ఒక పోటీ వాతావరణం నెలకొంది. అంతే, చిరంజీవి నటించిన ప్రతి సినిమా నేను చూసేవాడిని. ఆయన ఫైట్స్, డాన్సులు బాగా చేసేవారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్ జనరేషన్ అయిపోయింది. అప్పుడు కొత్తగా ఒక జనరేషన్ మొదలైంది.. అన్నారు.
ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. ఆయన పలు భాషల్లో నటిస్తున్నారు. సుమన్ కి ఒక కుమార్తె ఉన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద ఆయన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మీడియాలో హైలెట్ అవుతూ ఉంటారు.
Also Read : పవన్ కళ్యాణ్ సినిమా కోసం చిరంజీవి మరో త్యాగం..అభిమానులకు ఆనందపడాలో, బాధపడాలో తెలియని పరిస్థితి!
Web Title: Chiranjeevi suman box office war comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com