Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన ఆయన జీవిత కథను చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్లు కూడా ఇండస్ట్రీలో రాణించాలనే ఉద్దేశ్యం తో భారీ సంకల్పాన్ని పూనుకొని ముందుకు సాగుతూ ఉంటారు…మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తున్నాయి. ఒక 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన సోలో హీరోగా రాణిస్తూ ఇప్పటికి తన మార్కెట్ ను కాపాడుకుంటున్నాడు అంటే మామూలు విషయం కాదు…ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఆయన ఒక షోలో పాల్గొన్నప్పుడు తను చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ను ఇప్పుడున్న హీరోల్లో ఏ హీరోలు చేస్తే బాగుంటుంది అని ప్రశ్న అడగారు. దానికి చిరంజీవి(Chiranjeevi)స్పందిస్తూ రామ్ చరణ్ (Ram Charan) గానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గానీ ఈ సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు…నిజానికి చిరంజీవి కెరీర్లో టాప్ టెన్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటిగా నిలుస్తుంది.
పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ఒకప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఒక ఊపు ఊపేసాడనే చెప్పాలి.
ఆయన చేసిన యాక్టింగ్ ను జనాలు బయట ఇమిటెట్ చేస్తూ ఆయన మేనరిజమ్స్ ని వాడుకుంటూ వాళ్లకు వాళ్లే చిరంజీవిల ఊహించుకునే వారు అంటే ఆయన జనాల్లో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు…
అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు…వీళ్ళు మాత్రమే ఆ క్యారెక్టర్ ని చాలా ఈజ్ తో చేయగలరు. అలాగే వీళ్ళకి క్రేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వీళ్లను ఆదరించే అభిమానులు కూడా చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వీళ్లిద్దరు మాత్రమే ఆ క్యారెక్టర్ ని చేయగలరని చిరంజీవి చెప్పినట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఫ్యూచర్లో ఈ సినిమాలని మళ్ళీ రీమేక్ చేస్తారా లేదా అనేది…