Chiranjeevi: టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన పేరు వింటే చాలు రికార్డులు మారుమోగుతాయి. ముసలి వారు సైతం స్టెప్పులేస్తారు. ఇక కుర్రకారు అయితే చెప్పనవసరం లేదు. అలాంటి వారు మన మెగాస్టార్ చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యువతరం హీరోలకు తీసిపోకుండా డాన్సులు చేస్తూ అందరి చేతి శభాష్ అనిపించుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ఆయన కూడా ఓ రోల్ పోషించారు. ఇక ఇంకేముంది మెగా అభిమానులకు పండగే.

ఈ నేపథ్యంలో మరో దర్శకుడు హరీశ్ శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంతో ఆయన అడిగిన ప్రశ్నలకు చకచకా జవాబులు ఇచ్చారు. ఇక్కడ హరీశ్ ఓ టిపికల్ ప్రశ్న అడిగారు. రాంచరణ్ కాకుండా తెలుగులో బాగా డాన్సు చేసే వారెవరు? అని అడిగారు. దీంతో చిరంజీవి బన్నీ, తారక్, రామ్, నితిన్ అందరు బాగా డాన్సు చేస్తున్నారని చెప్పారు. మీ దృష్టిలో ఎవరు బాగా చేస్తారంటే తారక్, బన్నీ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Also Read: Manoj Bajpayee: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టింది.. చిచ్చు రేపుతున్న నటుడు కామెంట్స్ !
అందరు బాగా చేస్తున్నారని చెప్పినా హీరో మహేశ్ బాబు పేరు చెప్పకపోవడంతో అందరు ఖంగుతిన్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆచార్య సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా మహేశ్ బాబేనట. అలాంటిది ఆయన పేరు చెప్పకపోవడమేమిటనే ప్రశ్నలు ఆయన అభిమానుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆచార్య రిజల్ట్ ఎలా ఉంటుందో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

అనుకోకుండా వచ్చిందో ఏమో కానీ చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. శ్రీమంతుడుకు మద్దతు ఇవ్వని మెగాస్టార్ అంటూ చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబుకు డాన్సు రాదా? ఆయన స్టెప్పులు వేయలేరా? అంటూ తెగ ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై మెగా మహేశ్ బాబు అభిమానుల్లో ఎంత రాద్ధాంతం జరుగుతుందో తెలియడం లేదు. యాదృచ్చికంగా మాట్లాడినా చిరు మహేశ్ బాబు పేరు చెప్పకపోవడంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి.
Also Read:Amazon Prime: అమెజాన్ ప్రైమ్ లో అత్యధికంగా చూసిన తెలుగు సినిమాలేంటో తెలుసా?
Recommended Videos:




[…] Corona- Online Classes: కరోనా నాలుగో దశ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ మేరకు దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 3,377 కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ కరోనా తన ప్రభావం చూపుతుందా అనే అనుమానాలలు అందరిలో వ్యక్తమవుతన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరిగితే ఎలా అనే దానిపై తల్లిదండ్రుల మనోగతం తెలుసుకునేందుకు ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఇందులో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కరోనా కేసులు పెరిగితే ఆన్ లైన్ క్లాసులే శరణ్యమనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. […]