Chiranjeevi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సీనియర్ హీరోలు సైతం తమను తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
మెగాస్టార్ చిరంజీవి (Chitanjeevi) హీరోగా వశిష్ట (Vashishta) డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర (Vishvambhara) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి వీడియో కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకత్తించింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ కి చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. మరి ఈ సినిమాని మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి అది వీలు పడక పోస్ట్ పోన్ చేశారు. ఇక ప్రస్తుతం మే లో రిలీజ్ చేద్దామని అనుకున్నప్పటికి అది కూడా వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదు. మరి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సరైన డేట్ ని వివరించే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు కనక సరైన డేట్ ని ప్రకటించకపోతే మాత్రం ఈ సినిమా మీద భారీగా నెగిటివ్ పబ్లిసిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు చెప్పే డేట్ పక్కాగా ఉండాలి. అలాగే అనుకున్న సమయానికి థియేటర్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అయితే మేకర్స్ పైనే ఉంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన నటన ప్రతిభ ను చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఈ సినిమాతో షేక్ చేయాలనే ఉద్దేశ్యంలో చిరంజీవి ఉన్నారట. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోగా మార్చి భారీ వసూళ్లను సాధించిన సినిమాగా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా జూలైలో వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పటివరకు ఒక డేట్ ని ప్రకటించినప్పటికి ఆ డేట్ కి వస్తారా లేదా అనేది అయితే సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. మరి వశిష్ట ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే ఈ సినిమా రోజురోజుకి లేట్ అవుతూ వస్తుందట. చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు తద్వారా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?