Chiranjeevi Rejected Movies: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సైతం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చిరంజీవి ఒక స్టోరీని అంచనా వేయడంలో చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాడు. ఏ సినిమా అయితే ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని చిరంజీవి చాలా బాగా పసిగట్టి అలాంటి కథలను అలాంటి క్యారెక్టరైజేషన్ లో నటించడానికి సిద్ధమవుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫుల్ సినిమాలను చిరంజీవి మిస్ చేసుకున్నాడు… ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అంటే బాలయ్య బాబు హీరోగా చేసిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమా కావడం విశేషం…
ఈ స్టోరీని మొదటి చిరంజీవి దగ్గరికి తీసుకొచ్చారట. కానీ అనుకొని కారణాల వల్ల చిరంజీవి ఆ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాను బాలయ్య బాబు చేసి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత నాగార్జున కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిన ‘హలో బ్రదర్’ సినిమాని సైతం మొదట చిరంజీవి వద్దకే తీసుకువచ్చారట.
కానీ చిరంజీవి మాత్రం అంత కామెడీగా సాగే ఆ సినిమాలో తనను ప్రేక్షకులు చూస్తారో లేదో అనే ఇబ్బందితో ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రెండు సినిమాలు అటు బాలయ్య, ఇటు నాగార్జున కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలవడం విశేషం…
ఇక ఈ రెండు సినిమాలను ఎందుకు మిస్ అయ్యాను అంటూ చిరంజీవి ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి తమ సన్నిహితులతో చెబుతూ ఉంటారట. మొత్తానికైతే ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది…
