
మగధీర వంటి సినిమాలో చిరు గెస్ట్ అప్పియర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆచార్యలో స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు రామ్ చరణ్. అయితే.. త్వరలో మరో భారీ మల్టీస్టారర్ లో.. పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్టు సమాచారం. అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కబోతున్న ఈ సినిమాతో తండ్రీకొడుకులు బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
‘ఆచార్య’పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్, లేటెస్ట్ గా రిలీజ్ అయిన లాహే లాహే సాంగ్ తో ఎక్స్ పెక్టేషన్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. సిద్ధ పాత్రలో కనిపించబోతున్న రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నక్సలైట్ ఎపిసోడ్ ను ఎలా తెరకెక్కించారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
అయితే.. రామ్ చరణ్ తో దిగ్గజ దర్శకుడు శంకర్ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. ఇండియన్-2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తమ సినిమా కంప్లీట్ చేయకుండా.. మరో సినిమా చేయొద్దని ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ వివాదం ఎలా ఉన్నా,రామ్ చరణ్ తో సినిమా మాత్రం చేయాలని శంకర్ భావిస్తున్నట్టు సమాచారం.
కాగా.. ఈ సినిమా పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న యువకుడు.. ముఖ్యమంత్రిగా ఎలా గెలిచాడు అన్నదే సినిమా కథగా ప్రచారం సాగుతోంది. ఈ క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపించనున్నాడు. అయితే.. ఇందులో మెగాస్టార్ కూడా కనిపించబోతున్నట్టు సమాచారం.
మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ గా చిరు నటిస్తారని తెలుస్తోంది. గతంలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్టుతో శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో.. ఇప్పుడురామ్ చరణ్ ను ఎలా చూపించబోతున్నాడో అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది చూడాలి.