Chiranjeevi – Ram Charan Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టార్రర్ సినిమాల జోరు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మల్టీస్తార్రర్ చాలా భయపడేవాళ్ళు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు చాలా తేలికగా మల్టీస్టార్రర్ సినిమాలు వచేస్తున్నాయి. దర్శక నిర్మాతలకు అంత ధైర్యం రావడానికి కారణం #RRR చిత్రమే, గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. అయితే అదే ఏడాది వచ్చిన మరో మల్టీస్టార్రెర్ ‘ఆచార్య’ చిత్రం మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత ఇక చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమాని ఎప్పటికీ చూడలేమని అభిమానులు నిరాశ చెందారు. అలా నిరాశ చెందిన అభిమానుల కోసం ఇప్పుడు ఒక శుభవార్త. చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని విశేషాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
కేజీయఫ్ సిరీస్ ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ అతి త్వరలోనే రామ్ చరణ్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. గతం లో ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లోని చిరంజీవి ఇంట్లో ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ని వివరించాడు. ఆయన చిరంజీవి మరియు రామ్ చరణ్ ని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే ఇది కేవలం రామ్ చరణ్ సినిమా అని ఇన్ని రోజులు అనుకున్నారు ఫ్యాన్స్.
కానీ ఇందులో రామ్ చరణ్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా నటించబోతున్నట్టు సమాచారం. దీవీవీ దానయ్య ఈ సినిమా కోసం వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టబోతున్నాడు అట. ఈ ఏడాది లోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు చిరంజీవి పుట్టినరోజు నాడు తెలియచేయ్యబోతున్నారు.