https://oktelugu.com/

‘మా’ వివాదంపై రగిలిపోతున్న చిరంజీవి

ఒకప్పుడు టాలీవుడ్ కు దాసరి నారాయణరావు పెద్దదిక్కుగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు. ఇండస్ట్రీ పెద్దగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కరోనా లాక్ డౌన్ వేళ ఆర్థికసాయంతోపాటు టీకాలు తాజాగా వేయిస్తున్నారు.ఎంతో సేవ చేస్తున్నప్పటికీ చిరంజీవిని చికాకు పెట్టేలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాగుతున్నాయని.. ఏకగ్రీవానికి చిరంజీవి ప్రయత్నించినా అది ఫలించలేదని టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీ పెద్దగా సినీ కళాకారులను ఆదుకుంటున్న చిరంజీవికి ‘మా’ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు […]

Written By: , Updated On : June 27, 2021 / 08:31 PM IST
Follow us on

ఒకప్పుడు టాలీవుడ్ కు దాసరి నారాయణరావు పెద్దదిక్కుగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు. ఇండస్ట్రీ పెద్దగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కరోనా లాక్ డౌన్ వేళ ఆర్థికసాయంతోపాటు టీకాలు తాజాగా వేయిస్తున్నారు.ఎంతో సేవ చేస్తున్నప్పటికీ చిరంజీవిని చికాకు పెట్టేలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాగుతున్నాయని.. ఏకగ్రీవానికి చిరంజీవి ప్రయత్నించినా అది ఫలించలేదని టాక్ నడుస్తోంది.

ఇండస్ట్రీ పెద్దగా సినీ కళాకారులను ఆదుకుంటున్న చిరంజీవికి ‘మా’ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయట.. చిరంజీవి ప్రత్యర్థి సమూహాల మద్దతు ఉన్న మంచు విష్ణు, జీవిత, హేమలు తాజాగా ఆఫ్ ది రికార్డ్ చేస్తున్న వ్యాఖ్యలపై మెగాస్టార్ తెగ ఫీల్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ వివాదాల్లోకి మీడియా కూడా చేరింది. దాన్ని చిరిగి చాటంతా చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. మూవీ ప్రముఖుల అభిప్రాయాలతో వివాదాన్ని మరింతగా రాజేస్తోంది. ఇందులో చిరంజీవి పేరునుకూడా మీడియా లాగడం.. ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఇస్తున్నాడని అనడం మెగాస్టార్ ను మరింతగా ఇబ్బంది పెడుతోందట..

ఇప్పటికీ చిరంజీవి వివాదాలకు దూరంగా సామాజికసేవలో సినిమాల్లో ప్రశాంతతను కోరుకుంటున్నాడు. అందరివాడుగా ఉండాలనుకుంటున్నాడు. కానీ మా వివాదాలు ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని తెలుస్తోంది.