Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi and Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ అదేనా? నాయకుడొచ్చాడు అంటూ...

Chiranjeevi and Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ అదేనా? నాయకుడొచ్చాడు అంటూ చిరంజీవి చెప్పకనే చెప్పాడా?

Chiranjeevi and Pawan Kalyan : జనసేన జయకేతన సభ గ్రాండ్ సక్సెస్. ఈ సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ అదేనా? చిరంజీవి బలంగా కోరుకుంటున్నారా? అనే వాదన మొదలైంది.

జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభ అట్టహాసంగా ముగిసింది. పిఠాపురం వేదికగా జయకేతన పేరుతో నిర్వహించిన ఈ సభకు జనాలు పోటెత్తారు. జనసైనికులతో పాటు సామాన్య జనాలు పవన్ కళ్యాణ్ ప్రసంగం వినాలని వేదిక వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం జనరంజకంగా సాగింది. జనసేన పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొని బలమైన శక్తిగా అవతరించింది అని ఆయన అభిప్రాయపడ్డారు. సైద్ధాంతికంగా జనసేన పార్టీ ప్రయాణం సాగుతుందని జనసేనాని అన్నారు. అన్ని వర్గాల ప్రజల గొంతుక అవుతుంది. పేదల ప్రతినిధి జనసేన పార్టీ అని ఉద్ఘాటించారు.

Also Read : పవన్ కళ్యాణ్ ను పరిచయం చేయడానికి చిరంజీవి ఎలాంటి ట్రిక్ వాడాడో తెలుసా..?

పవన్ కళ్యాణ్ ఒక్కో మాట తూటాలా పేలింది. జనసైనికులను ఉర్రూతలు ఊగించింది. సామాన్య జనాల్లో ఆశలు నింపేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. కాగా పవన్ కళ్యాణ్ స్పీచ్ పై అన్నయ్య చిరంజీవి స్పందించారు. ఈ క్రమంలో చిరంజీవి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ”మై డియర్ పవన్ కళ్యాణ్… జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్ర ముగ్దుడిని అయ్యాను. సభకు వచ్చిన అశేష జనసంద్రం లానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జనసైనికులందరికీ నా శుభాకాంక్షలు!” అని ట్వీట్ చేశారు.

చిరంజీవి సందేశం పరిశీలిస్తే… పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ సీఎం పీఠం అధిరోహించడమే అని అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా అదే. ఒక కొత్త రాజకీయ ఒరవడికి పవన్ కళ్యాణ్ నాంది పలుకుతున్నాడు. డిప్యూటీ సీఎంగా బాధ్యలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళుతున్నారు. కూటమి ప్రభుత్వ భాగస్వామి అయి కూడా అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ అనే వాదన బలంగా వినిపిస్తుంది. ప్రజల్లో జనసేన గ్రాఫ్ పెరుగుతూ పోతుంది.

పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలి అంటే.. ఆయన సీఎం పీఠం ఎక్కాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని అన్నయ్య చిరంజీవి చూస్తున్నారు. పరోక్షంగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు అని భావిస్తున్నారు. సీఎం కావాలని కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్న భావన కలుగుతుంది. భాగస్వామ్య పార్టీలతో కలిసి నడుస్తూనే… తనదైన భావజాలం, సేవాదృక్పథం ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. వారి నమ్మకాన్ని చూరగొని సీఎం కావాలని కోరుకుంటున్నారు.

Also Read : 2023 లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు చేసిన మిస్టేక్స్ ఇవే…

RELATED ARTICLES

Most Popular